రాజ్‌కుంద్రా పోర్న్ బిజినెస్ గురించి తనకేమీ తెలియదన్న శిల్పాశెట్టి..!
తన భర్త రాజ్‌కుంద్రా పోర్న్ బిజినెస్ గురించి తనకేమీ తెలియదని శిల్పాశెట్టి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది.;
తన భర్త రాజ్‌కుంద్రా పోర్న్ బిజినెస్ గురించి తనకేమీ తెలియదని శిల్పాశెట్టి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది. దర్యాప్తులో భాగంగా రాజ్‌కుంద్రాను ఆయన నివాసంలో ప్రశ్నించేందుకు తీసుకెళ్లగా.. భర్త చేసే చీకటి వ్యాపారాల గురించి తనకేమీ తెలియదని శిల్పాశెట్టి కన్నీరుమున్నీరైనట్లు ముంబయి పోలీసు వర్గాలు తెలిపాయి.
దర్యాప్తులో భాగంగా రాజ్ కుంద్రాను ముంబయిలోని ఆయన నివాసానికి తీసుకెళ్లామని.. అక్కడే శిల్పాశెట్టిని కూడా ప్రశ్నించినట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. విచారణ అనంతరం శిల్పా టెన్షన్‌కు గురయ్యారని, భర్తతో ఆమె గొడవకు దిగినట్లు వెల్లడించాయి. రాజ్‌కుంద్రా ఈ యాప్‌ల గురించి ఏమీ తెలియనివ్వలేదని.. ఈ వ్యవహారం వల్ల కుటుంబం అపఖ్యాతి పాలవడంతో పాటు.. అనేక కాంట్రాక్టులు రద్దవుతున్నాయని.. దీంతో కుటుంబం భారీ ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటోందని శిల్పా ఆవేదన వ్యక్తం చేసినట్లు పోలీసు వర్గాలు వివరించాయి.
సమాజంలో అత్యున్నత స్థానంలో ఉన్న నువ్వు.. ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం ఏంటని శిల్పా శెట్టి భర్తను నిలదీసినట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. ఐతే.. పోర్న్ వీడియోల చిత్రీకరణ వ్యవహారంపై గత శుక్రవారం శిల్పాను పోలీసులు ప్రశ్నించగా.. తన భర్త అమాయకుడని, ఆయనకు ఇందులో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.
అటు.. శిల్పాశెట్టి, రాజ్‌కుంద్రా జాయింట్ అకౌంట్‌లో కోట్లలో లావాదేవీలు జరిగినట్లు క్రైమ్ బ్రాంచ్ గుర్తించింది. హాట్ షాట్స్, బాలీ ఫేమ్ యాప్‌ల ద్వారా వచ్చే ఆదాయం ఈ అకౌంట్‌లోకి వచ్చాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుంద్రాకు చెందిన వియాన్ సంస్థలో డైరెక్టర్‌గా ఉన్న శిల్పా శెట్టి.. గతేడాది రాజీనామా చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ బాధ్యతల నుంచి తప్పుకోవడానికి గల కారణాలపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది.