Srilanka Crisis: శ్రీలంక సంక్షోభం.. రికార్డు స్థాయిలో పెట్రో, డీజిల్ ధరలు

Srilanka Crisis: శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది.. ఆ దేశాన్ని ఇంధన కొరత తీవ్రంగా వేధిస్తోంది.

Update: 2022-05-24 07:47 GMT

Srilanka Crisis: మంగళవారం చమురు ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. లీటర్ పెట్రోల్ ధర 24.3 శాతం, డీజిల్ ధర 38.4 శాతం మేర పెరిగింది. ప్రస్తుతం పెట్రోల్ ధర లీటర్ రూ.420లకు లభిస్తోంది. డీజిల్ లీటర్ కు రూ.400 చెల్లించాల్సి వస్తోంది.

సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ చమురు ధరలను పెంచుతూ మంగళవారం నిర్ణయం తీసుకుంది. ప్రతి 15 రోజులకు ఒకసారి చమురు ధరల్లో మార్పు ఉంటుందని తెలిపారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లంక ఐఓసీ కూడా చమురు ధరలను పెంచింది.

దీంతో ఆటో డ్రైవర్లు భారీగా వసూల చేయనున్నారు. ప్రయాణికుడి వద్దనుంచి కిలోమీటరుకు రూ.90లు వసూలు చేస్తున్నారు. అయితే ఇంధన కొరతను తీర్చేందుకు శ్రీలంక ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

స్వతంత్ర దేశంగా అవతరించిన తర్వాత మొదటిసారి ఈ తరహా సంక్షోభ పరిస్థితిని దేశం ఎదుర్కొంటోంది. దీంతో పాటు విద్యుత్ కోతలు, ఆహార పదార్థాల కొరత ప్రజల కష్టాలను మరింత పెంచుతున్నాయి. ఔషధాల లేమితో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

Tags:    

Similar News