ఆన్‌లైన్‌లో కథలు చెబుతూ.. ఇంట్లో ఉండే డబ్బు సంపాదిస్తూ..

అందంగా, ఆకట్టుకునేలా కథలు చెబుతూ చిన్నారులను ఆకట్టుకోవాలి. అందుకు ఎంతో సమయస్పూర్తి కావాలి. అదే ఉపాధి మార్గం కూడా కావాలి.

Update: 2021-08-16 10:31 GMT

అందంగా, ఆకట్టుకునేలా కథలు చెబుతూ చిన్నారులను ఆకట్టుకోవాలి. అందుకు ఎంతో సమయస్పూర్తి కావాలి. అదు ఉపాధి మార్గం కావాలి. ఆలోచన వచ్చిందే తడవు ఆచరణలో పెట్టారు చెన్నైకి చెందిన ప్రీతిగయ. కోవిడ్ కారణంగా ఇంకా పాఠశాలలు తెరుచుకోలేదు. ఇంతకు ముందు బడికి వెళ్లి బోలెడు కథలు చెప్పే వారు. ఇప్పుడు ఇంట్లో కూర్చుని ఆన్‌లైన్ కథలు చెబుతున్నారు. చిన్నారుల బర్త్‌డే పార్టీల్లాంటి ఈవెంట్‌లకు కథలు చెప్పేందుకు ఆమె ఆహ్వానం అందుకుంటారు.

మార్చి 2020 లో, లాక్డౌన్ విధించినప్పుడు, ప్రీతిగయ తన కథలతో ఆన్‌లైన్‌కి వెళ్లడానికి సంకోచించారు. ఎలా రిసీవ్ చేసుకుంటారో అని కాస్త తడబడ్డారు. కానీ ఊహించని స్పందన మొదటి రోజే ఎదురైంది.

"మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి నేను 69 సెషన్‌లు చేసాను మరియు అది లేకపోతే నేను చేసే దానికంటే ఎక్కువ" అని ప్రీతిగయ చెప్పింది, ఖచ్చితమైన గణన పొందడానికి ఆమె ఎక్సెల్ షీట్‌ను స్క్రోల్ చేసింది. "ఇది నా ఏడేళ్ల కెరీర్‌లో హైజంప్ లాంటిది."

"ఆన్‌లైన్‌లో కథలు చెప్పడం గురించి నాకు దురభిప్రాయం ఉంది. నన్ను నేను తక్కువ అంచనా వేసుకున్నాను. ముఖాముఖి కథ చెప్పే సెషన్‌లో భావోద్వేగం ఉంటుంది. ప్రేక్షకులు ఎదురుగా ఉంటారు. దాంతో తెలియకుండానే నాలో శక్తి వస్తుంది. కానీ ఆన్‌లైన్ అవన్నీ ఎలా సాధ్యం అని ఆలోచించాను. అనేక సందేహాలతో

ఆమె ఏప్రిల్ 20 న తన మొదటి వర్క్‌షాప్‌ను ఆన్‌లైన్‌లో నిర్వహించింది. అప్పటి నుండి వెనక్కి తిరిగి చూడలేదు. "సాధారణంగా ఐదు వారాలలో నిర్వహించే సెషన్, ఒక వారంలో చేయగలిగాను," ఆమె చెప్పింది. గత వేసవి సెలవుల్లో, ఆమె సెషన్లలో అనేక మంది కొత్త ప్రేక్షకులు పాల్గొన్నారని తెలిపారు.

"కొత్త ప్రేక్షకులను పొందడానికి వాట్సాప్, ఫేస్‌బుక్‌లు సరిపోతాయి"అని స్టోరీ సాక్‌ని నడుపుతున్న ప్రీతిగయ చెప్పారు. ఆమె ప్రేక్షకులు ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రాంతాల నుండి కూడా ఉన్నారని ప్రీతిగయ తెలిపారు.

మాతృభాష రాజస్థానీలో కథలను పంచుకోవడం ఓ తియ్యని అనుభవం అంటారామె. "భారతదేశం నుంచే కాక విదేశాల నుంచి కూడా ప్రేక్షకులు ఉంటారని నేను ఎప్పుడూ అనుకోలేదు" అని అన్నారు. వినోదంతో పాటు విజ్ఞానం అందించడం ద్వారా పిల్లలు, పెద్దలను చేరుకోవడానికి ఆమె కంటెంట్ ప్రొడక్షన్ టెక్నిక్‌లను మెరుగుపరుచుకుంటున్నారు. 

Tags:    

Similar News