Supreme Court : రాజీవ్‌గాంధీ హత్య కేసులో నిందితుడికి బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు

Supreme Court : మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యకేసులో నిందితుడు ఏజీ పెరారివాలన్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

Update: 2022-03-10 02:30 GMT

Supreme Court : మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యకేసులో నిందితుడు ఏజీ పెరారివాలన్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం జీవిత ఖైదు అనుభవిస్తున్న ఆయన త్వరలో జైలు నుంచి విడుదల కానున్నారు. పెరారివాలన్ బెయిలు పిటిషన్‌పై విచారణ జరిపిన ద్విసభ్య ధర్మాసనం.. అతని ప్రవర్తనపై సంతృప్తి వ్యక్తం చేసింది. సత్ప్రవర్తన, విద్యార్హత, అనారోగ్యం వంటి కారణాలతో బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తెలిపింది. 47 ఏళ్ల పెరారివాలన్.. ఇప్పటికే 32 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.

1991 మే 21న రాజీవ్‌గాంధీ హత్యకు గురయ్యారు. తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో ఎన్నికల ర్యాలీలో ప్రసంగించేందుకు వెళ్లారు. ఈక్రమంలో ధను అనే మహిళ ఆత్మాహుతి దాడికి పాల్పడింది. ఈ ఘటనలో రాజీవ్‌గాంధీ, ధను సహా 13 మంది మృతి చెందారు. 1999 మే నెలలో పెరారివాలన్, మురుగన్, శాంతమ్, నళినితో పాటు ఏడుగురిని దోషులుగా నిర్ధారించింది కోర్టు. ఏడుగురికి జీవిత ఖైదు విధించగా.. వీరిలో ప్రస్తుతం ఆరుగురు జైలులో ఉన్నారు.

Tags:    

Similar News