CM KCR _Sharad Pawar : ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌తో సీఎం కేసీఆర్ భేటీ

CM KCR _Sharad Pawar : ఉద్ధవ్‌ థాక్రేతో భేటీ తర్వాత ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో సమావేశమయ్యారు సీఎం కేసీఆర్.

Update: 2022-02-20 12:15 GMT

CM KCR _Sharad Pawar : ఉద్ధవ్‌ థాక్రేతో భేటీ తర్వాత ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో సమావేశమయ్యారు సీఎం కేసీఆర్. ఈ భేటీలో దేశ రాజకీయాలు, కేంద్ర ప్రభుత్వ విధానాలపై చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే కూడా ఉన్నారు. అంతకుముందు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ థాక్రేతో చర్చలు జరిపారు సీఎం కేసీఆర్. దేశ రాజకీయాలపై ఉద్ధవ్‌తో చర్చించినట్లు చెప్పారు. దేశంలో రావాల్సిన మార్పులు, కేంద్ర ప్రభుత్వ విధానాలపైనా సమాలోచనలు జరిపినట్లు చెప్పారు.దేశంలో 75 సంవత్సరాల తర్వాత కూడా అనేక సమస్యలు ఉన్నాయన్నారు కేసీఆర్.

తెలంగాణ, మహారాష్ట్ర సోదర రాష్ట్రాలు అని అభివర్ణించారు. ప్రాంతీయ పార్టీలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్తులో అన్ని ప్రాంతీయ పార్టీలను కలుపుకుని ముందుకువెళ్తామన్నారు. హైదరాబాద్ లేదా మరేదైనా నగరంలో మరోసారి సమావేశమవుతామని చెప్పారు. చర్చలు ఇవాళే ప్రారంభమయ్యాన్నారు. కేంద్ర-రాష్ట్ర సంబంధాల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్ధవ్ థాక్రేను మహారాష్ట్ర రావాల్సిందిగా కోరారు కేసీఆర్. ఈ సమావేశాలకు సంబంధించి త్వరలోనే మంచి ఫలితాలు వస్తాయన్నారు. రాష్ట్రాలతో కేంద్రం వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదన్నారు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే. తమది హిందుత్వ వాదమే కానీ సూడో జాతీయ వాదం కాదన్నారు ఉద్ధవ్. సూడో జాతీయవాదాన్ని అడ్డుకోవాల్సిన అవసరముందన్నారు.

అంతకుముందు ప్రత్యేక విమానంలో ముంబై చేరుకున్న కేసీఆర్‌ ముందుగా గ్రాండ్ హయత్‌ హోటల్ చేరుకున్నారు. గ్రాండ్ హయత్ హోటల్‌లో సినీ నటుడు ప్రకాష్ రాజ్....సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా తన వెంట వచ్చిన నేతలను ప్రకాష్ రాజ్‌కు పరిచయం చేశారు సీఎం కేసీఆర్. తర్వాత అక్కడి నుంచి మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే నివాసానికి చేరుకున్నారు సీఎం కేసీఆర్. ఉద్ధవ్ థాక్రేతో కలిసి లంచ్ చేశారు. తర్వాత దేశ రాజకీయాలు, కేంద్ర ప్రభుత్వ విధానాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సమావేశం గంటన్నరకు పైగా కొనసాగింది.

Tags:    

Similar News