CM KCR : రేపు ముంబైకి కేసీఆర్.. జాతీయ రాజకీయాలపై ఉద్ధవ్ ఠాక్రేతో చర్చ ..!
CM KCR : సీఎం కేసీఆర్ రేపు ముంబై వెళ్లనున్నారు. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరే ఆహ్వానం మేరకు కేసీఆర్ ముంబై వెళ్లనున్నారు.;
CM KCR : సీఎం కేసీఆర్ రేపు ముంబై వెళ్లనున్నారు. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరే ఆహ్వానం మేరకు కేసీఆర్ ముంబై వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరనున్నారు. ముంబైలో సీఎం ఉద్దవ్ థాకరేతో కేసీఆర్ ప్రత్యేకంగా భేటీకానున్నారు.
జాతీయస్థాయి తాజా రాజకీయాలపై ఇరువురు సీఎంలు చర్చించనున్నారు. దీంతోపాటు కొత్త కూటమి ఏర్పాటుపై కసరత్తు చేయనున్నట్లు సమాచారం. సీఎం కేసీఆర్‌తో మంత్రి హరీశ్‌రావు కూడా వెళ్లే అవకాశం ఉంది. ముంబై పర్యటన అనంతరం సీఎం కేసీఆర్ కర్నాటక వెళ్లనున్నారు.
కర్నాటకలో మాజీ ప్రధాని దేవగౌడతో కేసీఆర్ భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో ఢిల్లీలో మమత బెనర్జీ నిర్వహించనున్న సమావేశానికి కూడా సీఎం కేసీఆర్ వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం.