Emergency Landing: ఆకాశంలో ఆగిన విమానం.. ప్రయాణీకుల్లో భయం
Emergency Landing:;
Emergency Landing: అప్పుడే విమానం రన్ వే మీద నుంచి పైకి ఎగిరింది.. అంతలోనే ఇబ్బంది.. విషయం తెలుసుకున్న ప్రయాణీకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏమి జరుగుతుందో అని టెన్షన్ కు గురయ్యారు. విమాన సిబ్బంది వెంటనే అప్రమత్తమై టెకాఫ్ అయిన కొద్ది సేపటికే సురక్షితంగా ల్యాండ్ చేశారు. ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ఘటన ముంబైలో చోటు చేసుకుంది. ఎయిర్ ఇండియా విమానం ముంబై ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి ఉదయం బెంగళూరుకు బయలు దేరింది. ఆకాశంలో ఎగిరిన 27 నిమిషాల అనంతరం విమానంలో టెక్నికల్ ప్రాబ్లమ్ ఏర్పడింది. సమస్యను గుర్తించేందుకు విమాన సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించారు. ఎండ వేడి అధికంగా ఉండడంతో ఇంజన్ పై ఒత్తిడి పెరిగి సమస్య ఏర్పడిందని సిబ్బంది గుర్తించారు.
విషయాన్ని వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేశారు. అత్యవసరంగా విమానాన్ని ముంబైలోనే ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఇంజన్ పై ఒత్తిడి పెరగడంతో ఆగిపోయినట్లు పైలెట్ గుర్తించారని వెంటనే ముంబై ఎయిర్ పోర్టులో సేఫ్గా ల్యాండ్ చేశారని ఎయిర్ ఇండియా ప్రతినిధి వెల్లడించారు. మరో విమానంలో ప్రయాణీకులను బెంగళూరుకు చేర్చడం జరిగిందన్నారు. దీనిపై దర్యాప్తు జరిపించాలని డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆదేశాలు జారీ చేసింది.