RRB Exam: తన పరీక్ష స్నేహితుడి చేత రాయించేందుకు.. బొటనవేలు కత్తిరించి..
RRB Exam: ఆ తెలివి తేటలు ఏవో చదుకోవడానికి ఉపయోగించొచ్చు కదా. ఎగ్జామ్ హాల్లో కాపీ ఎలా కొట్టాలి. ఇన్విజిలేటర్స్‌ని ఎలా బురిడీ కొట్టించాలి అని ఎత్తులకు పై ఎత్తులు వేస్తుంటారు విద్యార్ధులు. పట్టుబడితే పరువు పోతుందన్న ఆలోచన కూడా ఉండదు.
Gujarath: ఆ తెలివి తేటలు ఏవో చదుకోవడానికి ఉపయోగించొచ్చు కదా. ఎగ్జామ్ హాల్లో కాపీ ఎలా కొట్టాలి. ఇన్విజిలేటర్స్‌ని ఎలా బురిడీ కొట్టించాలి అని ఎత్తులకు పై ఎత్తులు వేస్తుంటారు విద్యార్ధులు. పట్టుబడితే పరువు పోతుందన్న ఆలోచన కూడా ఉండదు. పట్టుదలగా ప్రయత్నించే వారు కొందరైతే పక్కదారిలో పాస్ అవ్వాలని ప్రయత్నించే వారు మరికొందరు. అతడు చదువుకునే వ్యక్తి కూడా కాదు.
చదువు పూర్తయి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. గుజరాత్ వడోదరకు చెందిన మనీశ్ కుమార్ అనే విద్యార్థి భారతీయ రైల్వేలో గ్రూప్ డీ నియామక పరీక్ష రాసేందుకు తన బదులు మిత్రుడు గుప్తాను పంపించాలనుకున్నాడు. ఇందుకోసం తన తెలివి తేటలు ప్రయోగించాడు. పరీక్ష హాల్లోకి వెళ్లేముందు బయోమెట్రిక్ ఉంటుందని తెలుసుకున్న యువకుడు తన బొటనవేలి చర్మాన్ని కత్తిరించి స్నేహితుడి చేతికి అంటించాలనుకున్నాడు.
ఇందుకోసం వేడి పాత్ర మీద చేయిపెట్టి పొక్కుగా వచ్చిన చర్మాన్ని బ్లేడ్ సహాయంతో కత్తిరించి స్నేహితుడి బోటనవేలికి అంటించాడు. అయితే పరీక్ష జరుగుతున్న సమయంలో బయోమెట్రిక్ ధ్రువీకరణ కోసం వచ్చిన నిర్వాహకుడు పలుసార్లు ప్రయత్నించినప్పటికీ విఫలమయ్యాడు. అదే సమయంలో సదరు అభ్యర్థి అనుమానాస్పదంగా చేతులను దాచుకునే ప్రయత్నం చేయడంతో అనుమానం వచ్చిన నిర్వాహకుడు.. యువకుడిని చేతులపై శానిటైజర్ వేసి శుభ్రం చేసుకోవాలని సూచించాడు. దాంతో చేతికి అంటించిన చర్మం ఊడిపోవడంతో అసలు విషయం బయటపడింది. అసలు మోసం గ్రహించిన ఇన్విజిలేటర్ పోలీసులకు సమాచారమిచ్చారు. అభ్యర్థిని విచారించిన పోలీసులు మనీవ్ కుమార్‌తో పాటు అతడి స్థానంలో పరీక్షకు హాజరైన గుప్తాను కూడా అరెస్ట్ చేశారు.