Short 15 News : షార్ట్ 15 న్యూస్.. ఫటాఫట్..!

Tv5 Short 15 News : ఆసియాలోనే అతిపెద్దదైన మేడారం మహాజాతర ప్రధాన ఘట్టం ఆవిష్కృతమైంది. కోట్లాదిమంది భక్తులు ఎదురుచూసిన వనదేవత సమ్మక్క వనం నుంచి జనంలోకి వేంచేసింది.

Update: 2022-02-18 03:54 GMT

1 ) ఆసియాలోనే అతిపెద్దదైన మేడారం మహాజాతర ప్రధాన ఘట్టం ఆవిష్కృతమైంది. కోట్లాదిమంది భక్తులు ఎదురుచూసిన వనదేవత సమ్మక్క వనం నుంచి జనంలోకి వేంచేసింది.చిలకలగుట్ట నుంచి తరలివచ్చి మేడారం గద్దెలపైకి చేరింది. దీనితో జాతర పరిపూర్ణమైంది

2 )సమ్మక్క-సారలమ్మను చూసేందుకు ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు. దీంతో మేడారం జనసంద్రమైంది. మరోవైపు ఈ రోజు సమ్మక్క, సారలమ్మను తెలంగాణ సీఎం కేసీఆర్‌ దర్శించుకుంటారు.

3) ఏపీలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్యకేసు విచారణ కీలక దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసును దర్యాప్తు చేసేందుకు.. ఢిల్లీ నుంచి సీబీఐ డీఐజీ చౌరాసియా కడప చేరుకున్నారు. సీబీఐ అధికారులతో సమావేశమైన చర్చలు జరిపారు.

4) ఏపీలో సినిమా టికెట్ల ధరలపై కమిటీ సమావేశం నిర్వహించింది.. ధరల నిర్ణయం కోసం స్లాబులపై కమిటీ ప్రధానంగా చర్చించింది.. త్వరలో సినిమా టికెట్ల ధరల పెంపు ఉంటుందని కమిటీ సభ్యులు స్పష్టం చేశారు.

5) హిజాబ్‌ వివాదం కొనసాగుతుండగా... మరో కీలక నిర్ణయం తీసుకుంది కర్ణాటక సర్కారు. మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడిచే అన్ని స్కూళ్లు, కాలేజీల్లోనూ హిజాబ్, కాషాయ కండువాలతోసహా మతపరమైన దుస్తులపై నిషేధం విధించింది.

6) ఎల్‌ఐసీని ప్రైవేటీకరణ చేయడం సరైన నిర్ణయం కాదంటూ హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ ఎల్‌ఐసీ ఉద్యోగులు కొవ్వొత్తుల ప్రదర్శనతో నిరసన వ్యక్తం చేశారు. దీనివల్ల పాలసీదారులు పెద్ద సంఖ్యలో నష్టపోతారన్నారు.

7 ) ఎర్రకోటపై ఏదో ఒకరోజు కాషాయ జెండా ఎగురుతుందంటూ కర్ణాటక మంత్రి కేఎస్‌ ఈశ్వరప్ప వ్యాఖ్యలు దూమారం రేపుతున్నాయి. మంత్రి వ్యాఖ్యలపై మండిపడిన కాంగ్రెస్‌ నేతలు...ఆయన్ను బర్త్ రఫ్ చేయాలంటూ రాత్రి అసెంబ్లీలోనే పడుకుని నిరసన చేశారు.

8) భారత ఎంపీలలో సగం మందికిపైగా అత్యాచారం, హత్య వంటి నేరారోపణలు పెండింగ్‌లో ఉన్నాయంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు సింగపూర్​ప్రధాని లీ షిన్​ లూంగ్. దీనిపై కేంద్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

9) చెన్నై నుంచి బయలుదేరిన ఆల్‌ ఉమెన్‌ ఆర్మీ యాత్ర విశాఖకు చేరుకుంది. ఏడుగురు సభ్యుల ఆర్మీ ఆఫీసర్ల బృందం బవేరియా క్లాస్‌ బోట్‌లో సముద్రంపై 54 గంటల పాటు సాహసయాత్ర చేసి విశాఖ తీరానికి చేరుకుంది.

10) రిలయన్స్​జియోకు షాక్​ ఇచ్చారు కస్టమర్స్‌లు . సుమారు కోటి 29లక్షల మంది జియోను వీడారు. అటు.. అనూహ్యంగా బీఎస్‌ఎన్‌ఎల్‌​ తన కస్టమర్సను భారీ స్థాయిలో పెంచుకుంది. ఈ మేరకు ట్రాయ్‌ డిసెంబర్‌ గణాంకాలను రిలీజ్‌ చేసింది.

11 ) ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో సమాజ్‌వాదీ పార్టీ జోరు పెంచుతోంది. ఎస్పీ అధినేత అఖిలేష్‌ అన్నీ తానై ప్రచారం చేయగా.. ఆయన తండ్రి ములాయం సింగ్ యాదవ్‌ సైతం ప్రచారబరిలో దిగారు.

12 ) టీటీడీ పాలక మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కరోనా కారణంగా రెండేళ్ల క్రితం నిలిపివేసిన ఆర్జిత సేవలను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది.

13) శ్రీశైలంలో 21వ తేదీ వరకూ స్వామివారి స్పర్శ దర్శనానికి అవకాశం కల్పిస్తున్నట్టు ఈవో తెలిపారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 22వ తేదీ నుంచి మార్చి 4వ తేదీ వరకూ ఈ అవకాశం ఉండబోదని స్పష్టం చేశారు.

14) తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి కల్యాణోత్సవం లో భాగంగా చివరి ఘట్టమైన తెప్పోత్సవము వైభవంగా జరిగింది.ఈ కార్యక్రమం తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు.

15) కర్నూలు జిల్లా నంద్యాలలో సినీ నటి అనుపమ సందడి చేసింది. ఓ వస్త్ర దుకాణం ప్రారంభోత్సవంలో పాల్గొంది. అనుపమనుచూసేందుకు అభిమానులు ఎగబడ్డారు.

Tags:    

Similar News