TRS ఓ మోస పూరిత పార్టీ : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి..!
వరంగల్ పట్టణ అభివృద్ధి కోసం తండ్రీకొడుకులు ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. వరంగల్ నగర అభివృద్ధి కోసం ప్రధాని మోదీ నిధులు కేటాయించి సుందరీకరించారని కొనియాడారు.;
టీఆర్‌ఎస్ ఓ మోసపూరిత పార్టీ అని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. వరంగల్ పట్టణ అభివృద్ధి కోసం తండ్రీకొడుకులు ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. వరంగల్ నగర అభివృద్ధి కోసం ప్రధాని మోదీ నిధులు కేటాయించి సుందరీకరించారని కొనియాడారు. అమృత స్మార్ట్ సిటీ,550 కోట్ల నిధులతో రింగ్ రోడ్డు పనులు నరేంద్ర మోదీ మాత్రమే చేశారని అన్నారు.
రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ కోసం సెంటు భూమి కూడ ఇవ్వలేని TRS పార్టీకి ఓటు వేయవద్దని సూచించారు. వరంగల్ నగరంలో సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ ఏర్పాటు చేసిన ఘనత బీజేపీకే దక్కుతుందని వ్యాఖ్యానించారు. వరంగల్- హైదరాబాద్ వెళ్లే జాతీయరహదారి నిర్మాణం కోసం ప్రధాని మోదీ 2వేల ఓట్ల రూపాయలు కేటాయించారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.