Ramdas Athawale : భార్యా దినోత్సవం జరుపుకోవాల్సిందే.. కేంద్ర మంత్రి డిమాండ్
Ramdas Athawale : మాతృదినోత్సవం తరహాలోనే 'భార్యా దినోత్సవం' జరుపుకోవాలని కేంద్ర సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి రాందాస్ అథవాలే ఆదివారం డిమాండ్ చేశారు.;
Ramdas Athawale : మాతృదినోత్సవం తరహాలోనే 'భార్యా దినోత్సవం' జరుపుకోవాలని కేంద్ర సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి రాందాస్ అథవాలే ఆదివారం డిమాండ్ చేశారు. మహారాష్ట్రలోని సాంగ్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో అథవాలే మాట్లాడుతూ.. 'తల్లి జన్మనిస్తుంది. అదేవిధంగా భర్త మంచి, చెడుల్లో భార్య పాలుపంచుకుంటుంది. ప్రతి పురుషుడి విజయం వెనుక స్త్రీ ఉంటుంది. అటువంటప్పుడు భార్య దినోత్సవం కూడా జరుపుకోవాల్సిందే' అని అన్నారు. కాగా.. అంతర్జాతీయ మాతృ దినోత్సవాన్ని మే నెలలోని రెండవ ఆదివారం రోజున జరుపుకుంటారు.