వేడి వేడి అన్నం వడ్డించడంలేని అత్తపై కేసు పెట్టిన కోడలు...!
తనకి వేడి వేడి అన్నం వడ్డించడంలేదంటూ అత్తపైన పైన కేసు పెట్టింది ఓ కోడలు.. ఈ విచిత్రమైన సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది.;
తనకి వేడి వేడి అన్నం వడ్డించడంలేదంటూ అత్తపైన పైన కేసు పెట్టింది ఓ కోడలు.. ఈ విచిత్రమైన సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మంజ్‌గన్వాలో అత్త, కోడళ్లు ఒకే ఇంట్లో ఉంటున్నారు. అయితే వీరిద్దరి భర్తలు వృత్తిరిత్యా వేరువేరు ప్రాంతాల్లో ఉంటారు.
ఈ క్రమంలో సమయానికి అత్త భోజనం వడ్డించలేదంటూ కోడలు ఇటీవలే పోలీసుల హెల్ప్ లైన్ 112కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. అనంతరం వారింటికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. తన అత్త సీరియ్తల్స్ లో లీనమై తనకు వేడి వేడి ఆహారం వడ్డించడం లేదని... అంతేకాకుండా పాడైన ఆహారాన్ని పెట్టడం వలన తన ఆరోగ్యం రోజు క్షీణిస్తోందని పోలీసుల దగ్గర వాపోయింది.
తన కోడలు తనపైన కేసు పెట్టిందని తెలుసుకున్న అత్త.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తనకి ఇంటి పనుల్లో సహాయం చేయకుండా.. ఎప్పుడు కూడా ఫోన్ పట్టుకొని ఉంటుందని పోలీసులకి వివరించింది. ఇద్దరి వాదనలను విన్న పోలీసులు.. అత్తకోడళ్లను మందలించి.. ఇలాంటి చిన్న చిన్న విషయాలకు పోలీసులను పిలిచి సమయాన్ని వృధా చేయొద్దని హెచ్చరించారు.