దేశంలో కొత్త కరోనా స్ట్రెయిన్‌పై కేంద్ర ఆరోగ్యశాఖ కీలక ప్రకటన

కరోనాకు అనవసరమైన థెరపీలు చేయవద్దని సూచించారు. దీంతో ఒత్తిడి పెరిగి వ్యాధి నిరోధకత తగ్గుతుందన్నారు.

Update: 2020-12-29 12:30 GMT

coronavirus(File Photo) 

కరోనా కొత్త వేరియంట్ స్ట్రెయిన్‌పై కేంద్ర ఆరోగ్యశాఖ కీలక ప్రకటన చేసింది. ఇప్పుడు వస్తున్న వ్యాక్సిన్లు.. కొత్త స్ట్రెయిన్‌కు కూడా పనిచేస్తాయని.. తెలిపింది. అయితే.. ఇప్పుడు వైరస్‌ తీవ్రత పెరగడంతో జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. యూకే నుంచి వచ్చినవారిలో స్ట్రెయిన్‌ వస్తే జీనోమ్ టెస్టులు నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 5 వేల జీనోమ్ పరీక్షలు నిర్వహించామన్నారు. కరోనాలో 17 మార్పులు జరిగాయి. వాటిలో 8 ముఖ్యమైనవన్నారు. కరోనాకు అనవసరమైన థెరపీలు చేయవద్దని సూచించారు. దీంతో ఒత్తిడి పెరిగి వ్యాధి నిరోధకత తగ్గుతుందన్నారు. వైరస్‌లో మార్పులు జరిగినా.. వ్యాక్సిన్ యాంటీ బాడీలు పనిచేస్తాయన్నారు.


Tags:    

Similar News