శాఖాహారుల్లో కరోనా వ్యాప్తి తక్కువే..!
విశాఖ ఉక్కు కోసం పల్లా శ్రీనివాస్ తర్వాత తాను దీక్ష చేసేందుకు సిద్ధమని సబ్బం హరి ప్రకటించారు. ఇవాళ పల్లా ఆమరణ దీక్షా శిబిరానికి వెళ్లి సంఘీభావం తెలిపారు.
శాఖహరుల్లో కరోనా వ్యాప్తి తక్కువగానే ఉంటోదని కేంద్ర పరిశోధన సంస్ధ CSIR(కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్) సర్వేలో వెల్లడైంది. ఇంకా 'ఓ' బ్లడ్ గ్రూప్ ఉన్నవారు వైరస్ బారిన పడే అవకాశాలు తక్కువేనని తేలింది.' ఇక బి', 'ఎబి' గ్రూప్ వారు కరోనా బారిన పడే అవకాశం ఉందని సర్వేలో తేలింది. సర్వేలో దేశంలోని మొత్తం 140మంది వైద్య నిపుణులు,శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. మొత్తం 10,427 మంది నమూనాలను సేకరించి విశ్లేషించారు. వీరందరూ స్వచ్ఛందంగా అధ్యయనంలో పాల్గొన్నారు. శాఖహరులు తినే ఆహరంలో అధిక మొత్తంలో ఉండే ఫైబర్.. కరోనాను ఎదురుకోవడంలో కీలకపాత్ర పోషిస్తుందని వెల్లడైంది.