Whale Ambergris: వలలో చిక్కిన తిమింగలం లాలాజలం.. దాని విలువ రూ.50 కోట్లు..
Whale Ambergris: దాదాపు 35.6 కిలోలల బరువున్న తిమింగలం వాంతి చిక్కుకుంది. అంబర్‌గ్రిస్ అనే తిమింగలం వాంతి విలువ బిలియన్ డాలర్లు పలుకుతుంది.;
Whale Ambergris: చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల వలలో రూ.50 కోట్ల విలువైన అంబర్ గ్రిజ్ (తిమింగలం వాంతి) చిక్కింది. ఇంతటి విలువైన అంబర్ గ్రిస్‌ని సముద్రపు బంగారంగా పేర్కొటారు. కల్పాక్కం గ్రామానికి చెందిన మాయకృష్ణన్, కర్ణన్‌తో కలిసి కొద్ది రోజుల క్రితం చేపల వేటకు సముద్రంలోకి వెళ్లారు.
అక్కడ వారికి వలలో అరుదైన వస్తువు చిక్కింది. దాదాపు 35.6 కిలోలల బరువున్న తిమింగలం వాంతి చిక్కుకుంది. అంబర్‌గ్రిస్ అనే తిమింగలం వాంతి విలువ బిలియన్ డాలర్లు పలుకుతుంది. దీనిని పరిమళ ద్రవ్యాల తయారీకి, ఇతర ఔషధాల తయారీకి ఉపయోగిస్తారు.
అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ కోట్లలో ఉంటుంది. మత్స్యకారుల వలలో చిక్కిన ఈ చేప లాలాజలం విలువ దాదాపు రూ. కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని చెబుతున్నారు. దీంతో ఇంద్రకుమార్, అతని తోటి మత్స్యకారులు ఒడ్డుకు చేరుకుని తిమింగలం లాలాజలంను అటవీశాఖ అధికారులకు అప్పగించారు.
సముద్ర బంగారం అని పిలిచే అంబర్ గ్రిస్ థాయ్‌లాండ్‌తో పాటు అనేక దేశాల్లో తిమింగలం వాంతిని కనుగొన్న మత్స్యకారుల జీవితాలు తారుమారయ్యాయి. అలాగే అదే ప్రాంతానికి చెందిన శేఖర్ వలలో కూడా 3 కిలోల తిమింగలం లాలాజలం చిక్కినట్లు అధికారులు కనుగొన్నారు. దానిని కూడా అటవీశాఖ అధికారులకు అప్పగించారు.