Chidambaram: కేబినెట్‌లో చర్చించకుండానే ప్రకటనలు చేస్తారా: మోదీపై చిదంబరం ఫైర్
Chidambaram: కేబినెట్ అప్రూవల్ లేకుండానే చట్టాల ఆమోదిస్తారు, తిరస్కరిస్తారు అని చిదంబడరం మోదీ ప్రభుత్వంపై మండి పడ్డారు.;
Chidambaram: కేంద్రంలోని బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ సీనియర్ లీడర్ పి. చిదంబరం. కేబినెట్‌లో చర్చించకుండానే ప్రధాని మోడీ ప్రకటనలు చేస్తారని ఆయన ఆరోపించారు. కేవలం బీజేపీ పాలనలోనే కేబినెట్ అప్రూవల్ లేకుండా చట్టాల ఆమోదం, తిరస్కారం జరుగుతుందన్నారు. హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాపైనా చిదంబరం విమర్శలు చేశారు. రైతుల కోసం మంచి సంస్కరణలు తీసుకువస్తున్నారంటూ పొగిడిన వారంతా ఇప్పుడేమయ్యారని ప్రశ్నించారు.