Yogi Adityanath : అక్కడ మాంసం, మద్యం నిషేధం.. యోగి సంచలన నిర్ణయం..!
Yogi Adityanath : శ్రీకృష్ణుడి జన్మస్థానమైన మధురలో మాంసం, మద్యం నిషేదిస్తున్నట్టుగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు.;
Yogi Adityanath : శ్రీకృష్ణుడి జన్మస్థానమైన మధురలో మాంసం, మద్యం నిషేదిస్తున్నట్టుగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. నిన్న శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా యోగి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు వీటి అమ్మకాల నివారణకి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మాంసం, మద్యం వ్యాపారం చేస్తున్న వారంతా పాల ఉత్పత్తిని పెంచి మధురకి తిరిగి పూర్వ వైభవాన్ని తీసుకురావాలని సూచించారు. లక్నోలో జరిగిన శ్రీ కృష్ణోత్సవ కార్యక్రమంలో సీఎం యోగి పాల్గొన్నారు. కాగా 2017లో యాత్రికుల పర్యాటక ప్రదేశాలుగా ప్రకటించబడిన బృందావన్ మరియు బర్సానా ప్రాంతాల్లో మాంసం మరియు మద్యం అమ్మకాలను ఇప్పటికే నిషేధించారు సీఎం యోగి ఆదిత్యనాథ్.