Ukraine Russia War : ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో బలవుతున్న అమాయకులు..
Ukraine Russia War : ఉక్రెయిన్ తాజాగా చేసిన బాంబు దాడిలో 40 మంది ఉక్రెయిన్ ఖైదీలు చనిపోయారు.;
Ukraine Russia War : ఉక్రెయిన్‌పై రష్యా భీకర యుద్ధం కొనసాగుతోంది. భయంకరమైన దాడులు చేస్తూ ఆయా నగరాలను తమ అధీనంలోకి తెచ్చుకుంటోంది. ఉక్రెయిన్ సైనికులు వేసిన దాడిలో అక్కడి జైల్లోఉన్న 40 మంది ఉక్రెయిన్ ఖైదీలు మరణించినట్లు తెలిసింది.
వీరంతా ఉక్రెయిన్ చేసిన బాంబు దాడి వల్లే మృత్యువాతపడినట్లు రష్యా ప్రతినిధి ఒకరు తెలిపారు. ఒలెనివ్కా పట్టణంలోని జైలుపై ఉక్రెయిన్ షెల్లింగ్జరపగా, 40 మంది మృతిచెందగా, మరో 130 మంది గాయపడ్డారని వెల్లడించారు. అయితే, దీనిపై ఉక్రెయిన్ అధికారుల స్పందించలేదు.