Iran : ఇరాన్‌ 'హిజాబ్‌ వ్యతిరేక' ఆందోళనల్లో 53 మంది మృతి..

Iran : ఇరాన్‌లో హిజాబ్ పై వ్యతిరేకత రోజు రోజుకు తీవ్రమవుతోంది

Update: 2022-09-27 13:00 GMT

Iran : ఇరాన్‌లో హిజాబ్ పై వ్యతిరేకత రోజు రోజుకు తీవ్రమవుతోంది. దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతున్నాయి. ఈ నిరసనల్లో 50మందికిపైగా ఆందోళన కారులు మరణించారు. నిరసనల్లో పాల్గొని మరణించిన ఓ యువకుడి అంత్యక్రియల్లో అతడి సోదరి తెలిపిన నిరసన భావోద్వేగానికి గురిచేసింది. జావెద్ హైదరీ అనే యువకుడు గత కొద్దిరోజులుగా సాగున్న హిజాబ్ నిరసనల్లో పాల్గొన్నాడు.

ఉధృతంగా సాగుతున్న నిరసనల్లో అతడు ప్రాణాలు కోల్పోయాడు. జావెద్ అంత్యక్రియల్లో పాల్గొన్న అతడి సోదరి తన జుట్టును కత్తిరించుకొని సోదరుడి మృతదేహంపై వేసి నిరసన తెలిపింది. ఈ ఘటన అందరిని కలచివేసింది. ఈ వీడియో ఇరాన్ వ్యాప్తంగా వైరల్‌గా మారింది.

కొద్దిరోజులక్రితం మహ్సా అమిని అనే 22 ఏళ్ల మహిళను మొరాలిటీ పోలీసులు అరెస్టు చేశారు. హిజాబ్‌ను సరిగ్గా ధరించలేదన్న ఆరోపణలతో ఆమెను కస్టడీలోకి తీసుకొన్నారు. దీంతో ఆమె కస్టడీలోనే మరణించింది. పోలీసులు హింసించడం వల్లే మరణించిందంటూ దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. దీంతో వేలాదిమంది మహిళలు, యువత ఇరాన్‌ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేపడుతున్నారు. మహిళలు ఏకంగా తమ జట్టును కత్తిరించుకొంటూ నిరసన తెలపుతున్నారు.

Tags:    

Similar News