Iran–Israel–US War : విడిపోతున్న ముస్లిం దేశాలు.. ఇదొక గుణపాఠమే..!

Update: 2026-03-04 07:15 GMT

ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్-అమెరికా యుద్ధం కాస్త రకరకాలుగా రూపం మార్చుకుంటోంది. పశ్చిమాసియాలో ఉన్న ముస్లిం దేశాలపై ఇరాన్ భీకర దాడులు చేస్తోంది. గల్ప్ దేశాలైన దుబాయ్, కువైట్, బహ్రెయిన్, సౌదీ, యెమన్, ఒమన్ తో పాటు ఇతర దేశాలపై కూడా దాడులు నిర్వహిస్తోంది. దీంతో ఆ దేశాలు కూడా ఇరాన్ మీద భగ్గుమంటున్నాయి. ఇలా అన్ని ముస్లిం దేశాలు విడిపోతున్నాయి. షియా ముస్లింలు వర్సెస్ సున్ని ముస్లింలు అన్నట్టు ప్రచారం జరుగుతోంది. కానీ ఇక్కడ చాలా విషయాలు అర్థం చేసుకోవాలి. ఇరాన్ కూడా ముస్లిం దేశమే అయినా.. గల్ఫ్‌ ముస్లిం దేశాలు బద్ధ శత్రువుగానే చూస్తాయి. ముస్లిం దేశాలే ఇంకో ముస్లిం దేశాన్ని శత్రువుగా చూస్తున్న కాలం ఇది. కానీ ఇండియాలో ఉన్న వారు మాత్రం దాన్ని అంగీకరించట్లేదు.

ఎంతసేపు ఏదైనా ముస్లిం దేశం మీద దాడి జరిగితే వెంటనే దాన్ని ఖండించేందుకు రోడ్ల మీదకొస్తారు. ఇప్పుడు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోతే.. ఇండియాలో ఉన్న ముస్లింలు రోడ్ల మీదకొచ్చి ధర్నాలు, ర్యాలీలు చేస్తున్నారు. అదే పెహల్గాం దాడిలో హిందువులను మాత్రమే చంపేస్తే.. ఏ ఒక్క ముస్లిం నాయకులు కూడా దాన్ని ఖండించలేదు. ఏదో పైకి నాలుగు డైలాగులు కొట్టారే తప్ప.. ఇప్పుడు ఖమేనీ మృతి పట్ల చేస్తున్న రేంజ్ లో ధర్నాలు, ర్యాలీలు చేయలేదు.

మేమంతా భారతీయలం అని చెప్పుకోవడానికంటే కూడా.. మేం పలానా అని చెప్పుకోడానికే ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్న వారు లేకపోలేదు ఇండియాలో. కాబట్టి అలాంటి వారంతా ఒకసారి పశ్చిమాసియాలో యుద్ధాన్ని పరిశీలించాలి. అక్కడ మతం కంటే దేశమే ఎక్కువ అన్నట్టు యుద్ధం నడుస్తోంది. కాబట్టి ముందు దేశం ఆ తర్వాతే మతం అన్నది అందరూ గుర్తుంచుకోవాలి. మతం ఒక్కటే అయినంత మాత్రాన వేరే దేశానికి వెళ్తే అక్కడి పౌరుడిగా మనల్ని చూడరు. నువ్వు పలానా దేశం వ్యక్తివి అని మాత్రమే చూస్తారు. కాబట్టి దీన్ని అందరూ గుర్తుంచుకుంటే బెటర్.

Tags:    

Similar News