China: ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాల మీద చైనా సైబర్ దాడులు..
China: చైనాకు చెందిన హ్యాకింగ్ గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా సైబర్ దాడులు చేస్తున్నట్లు వెల్లడైంది;
China: చైనాకు చెందిన రెడ్ ఆల్ఫా అనే హ్యాకింగ్ గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, NGOలు, న్యూస్ పబ్లికేషన్స్, థింక్ ట్యాంక్‌లను లక్ష్యంగా చేసుకుని సైబర్ దాడులు చేస్తున్నట్లు వెల్లడైంది. గతేడాది 350 డొమైన్లను రెడ్ ఆల్ఫా హ్యాక్ చేసిందని.. రికార్డెడ్ ఫ్యూచర్ అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ ధృవీకరించింది. రెడ్‌ఆల్పా గ్రూప్ భారత్‌లోని నేషనల్ ఇన్‌ఫర్మేటిక్స్ సెంటర్ లక్ష్యంగా దాడులు నిర్వహించినట్లు తెలిపింది.
భారత ప్రభుత్వానికి సంబంధించి అత్యధిక ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను NIC నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ హ్యుమన్ రైట్స్, అమ్నెస్టి ఇంటర్ నేషనల్, ది మెర్కటోర్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ చైనా స్టడీస్, రేడియో ఫ్రీ ఆసియా.. ది అమెరికన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ తైవాన్ వంటి సంస్థలు దీని బాధిత జాబితాలో ఉన్నాయి. దీంతోపాటు వీఘర్ ముస్లింలు, టిబెట్‌లోని మైనార్టీ వర్గాలకు చెందిన వ్యక్తులు, సంస్థలు కూడా టార్గెట్ జాబితాలో ఉన్నాయి.
ఇటీవల కాలంలో తైవాన్ రాజకీయ సంస్థలపై నిఘా పెట్టి సమాచారం సేకరిస్తున్నట్లు రికార్డెడ్ ఫ్యూచర్ పేర్కొంది. తైవాన్ నుంచి రిజిస్టర్ డొమైన్లలో నమోదయ్యే వెబ్‌సైట్లపై ఈ గ్రూపు నిఘా ఉందని వెల్లడించింది. వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడానికి ఒక రకమైన పీడీఎఫ్ ఫైల్స్‌ను ఫిషింగ్ సైట్స్ లింకులతో ఇది పంపిస్తుంది. వ్యక్తులు వీటిని తెరిస్తే ఆయా లాగిన్ క్రెడెన్షియల్స్ రెడ్‌ఆల్ఫా చేతికి వస్తాయి. ఈ సంస్థ వద్ద భారీ ఎత్తున సిబ్బంది వనరులు ఉన్నట్లు రికార్డెడ్ ఫ్యూచర్ వెల్లడించింది.