Afghan Suicide Attack : అఫ్గాన్‌లో ఆత్మాహుతి దాడి.. మత పెద్ద సహా 18 మంది మృతి..

Afghan Suicide Attack : అఫ్గన్‌లో ఇప్పట్లో సాధారణ పరిస్థితులు నెలకునే వాతావరణం కనుచూపు మేరలోనూ కనిపించడం లేదు

Update: 2022-09-02 13:32 GMT

Afghan Suicide Attack : అఫ్గన్‌లో ఇప్పట్లో సాధారణ పరిస్థితులు నెలకునే వాతావరణం కనుచూపు మేరలోనూ కనిపించడం లేదు. మరోసారి అఫ్గనిస్థాన్‌లో బాంబు పేలుళ్లు దద్ధరిల్లాయి. పశ్చిమ అఫ్గనిస్థాన్‌ నగరం హేరాత్‌లోని మసీదులో ముష్కరులు ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో ప్రముఖ మతపెద్ద సహా 18 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. మరో 20 మందికి గాయాలైనట్లు సమచారం.

శుక్రవారం ప్రార్థనలకు కొద్ది సేపటి ముందు గజర్గా మసీదులో పేలుళ్లు సంభవించినట్టు తెలుస్తోంది. ప్రముఖ మతగురువు ఇమామ్ ముజీబ్ ఉర్ రహ్మాన్ అన్సారీ ఈ ఘటనలో చనిపోయినట్టు స్థానికులు పేర్కొన్నారు. పేలుళ్ల తర్వాత రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాలతో ఆ ప్రాంతమంతా బీతావాహ వాతావరణం నెలకొంది.


Tags:    

Similar News