China Corona: చైనా రాజధానిలో మళ్లీ లౌక్‌డౌన్‌.. ఇప్పటికే పలు జిలాల్లో అమలు..

China Corona: బీజింగ్‌లో మళ్లీ లౌక్‌డౌన్‌ విధించారు. జీరో కొవిడ్‌ పాలసీకు అనుగుణంగా ఆదివారం నుంచి లాక్‌డౌన్‌ విధించారు.

Update: 2022-05-23 16:15 GMT

China Corona: చైనా రాజధాని బీజింగ్‌లో మళ్లీ లౌక్‌డౌన్‌ విధించారు. జీరో కొవిడ్‌ పాలసీకు అనుగుణంగా ఆదివారం నుంచి లాక్‌డౌన్‌ విధించారు. ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా. కొత్త ప్రదేశాల్లో కొత్త కరోనా కేసులు బయటపడుతునే ఉన్నాయి. దీంతో మరిన్ని నగరాలు సైతం లాక్‌డౌన్‌ పరిధిలో వెళ్తున్నాయి. హుయిడియన్‌, చావోయింగ్‌, ఫెంతాయ్‌, షన్‌యి, ఫాంగ్‌షాన్‌ జిల్లాల్లో.. ఆంక్షలు అమల్లో ఉన్నాయి.

ఆహారం డెలివరీ చేసే రెస్టారెంట్లు, ఫార్మసీలు మినహా థియేటర్లు, జిమ్‌లు, షాపింగ్‌మాల్స్ మొత్తం మూసేసారు. పార్కులను మాత్రం 30 శాతం సామర్ధ్యంతో నిర్వహిస్తున్నారు. బీజింగ్‌లోని ఈ ఐదు జిల్లాలకు చెందిన ఉద్యోగులు.. వర్క్‌ ఫ్రమ్‌ హోం చేయాలని అధికారులు ఆదేశించారు. ఈ నెల 28వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయి. ప్రజల నిర్లక్ష్యం కారణంగా, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడంతో కరోనా వ్యాప్తి చెందుతోంది.

Tags:    

Similar News