Langya Virus : చైనాలో మరో కొత్త వైరస్.. 'లాంగ్యా హెనిపా'.. ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే..?
Langya Virus : వైరస్‌లకు చైనా పుట్టినిళ్లుగా మారింది. తాజాగా చైనాలో మరో కొత్త వైరస్ బయటపడింది.;
Langya Virus : వైరస్‌లకు చైనా పుట్టినిళ్లుగా మారింది. తాజాగా చైనాలో మరో కొత్త వైరస్ బయటపడింది. జంతువుల నుంచి మరో వైరస్ మనుషులకు సోకినట్లు వైద్యులు గుర్తించారు. యానిమల్స్ నుంచి వ్యాపించే హెనిపా వైరస్ ఇటీవల షాంగ్ డాంగ్, హెనాన్ ప్రావిన్స్ ల్లో కొందరిలో కనిపిస్తోంది. జ్వరంతో బాధపడుతున్న పేషంట్ల నుంచి సేకరించిన స్వాబ్ లో వైరస్ ఆనవాళ్లు గుర్తించినట్లు వెల్లడించింది గ్లోబల్ టైమ్స్. ఈ వైరస్‌కు లాంగ్యా హెనిపా వైరస్‌గా పేరు పెట్టారు. బాధితుల్లో జ్వరం, దగ్గు, నీరసం, కండరాల నొప్పులు, వికారంగా ఉండటం, అనోరెక్సియా వంటి లక్షణాలు కనిపించాయి.