China Lockdown Earthquake : చైనాకు దెబ్బ మీద దెబ్బ.. అల్లాడిపోతున్న సామాన్య ప్రజలు..

China Lockdown Earthquake : చైనాను తాజాగా సంభవించిన భూకంపం మూలిగేనక్కపై తాటిపండు పడ్డట్టయింది;

Update: 2022-09-06 16:12 GMT

China Lockdown Earthquake : చైనాను తాజాగా సంభవించిన భూకంపం మూలిగేనక్కపై తాటిపండు పడ్డట్టయింది. గత కొన్ని రోజులుగా చైనాలో కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. దీంతో చైనా ప్రభుత్వం కఠిన నిబంధనలను అమలు చేస్తుంది. ఎక్కడ ఏ ఒక్క కోవిడ్ కేసు బయట పడ్డా.. ఆ ప్రాంతం మొత్తాన్ని సీల్ చేసి లాక్‌డౌన్ విధిస్తోంది.

భూకంపం సమయంలో ప్రజలు చెల్లాచెదురయిపోయి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. సిచువాన్ ప్రావిన్స్‌లో 6.8 తీవ్రతతో భూకంపం వచ్చింది. అప్పుడు కొందరు భవనం కిటికీల దగ్గరికి వచ్చి బిగ్గరగా అరిచారు. దీనికి అడ్డుకట్ట వేయడానికి చైనా భవనాలను, షాపింగ్ మాల్స్‌ను సీల్ చేస్తోంది. వీటికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ప్రజలను భూకంపాలు, వరదలు, అగ్ని ప్రమాదాల నుంచి రక్షించడానికి చైనా ప్రభుత్వం ఈ కఠిన నిబంధనలను అమలు చేస్తోందని ప్రభుత్వం వివరణ ఇస్తోంది. 

Tags:    

Similar News