Elon Musk : ఎలాన్ మస్క్ తండ్రి షాకింగ్ స్టేట్మెంట్..

Errol Musk : ఎలాన్ మస్క్ తండ్రి ఎరాల్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మనం పిల్లలు కనడానికే భూమి మీద ఉన్నమాంటూ ఆయన అన్నారు.

Update: 2022-07-16 10:14 GMT

Errol Musk : ఎలాన్ మస్క్ తండ్రి ఎరాల్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మనం పిల్లలు కనడానికే భూమి మీద ఉన్నమాంటూ ఆయన అన్నారు. గత కొన్ని రోజులుగా ఎలాన్ మస్క్ తండ్రి ఎరాల్ మస్క్ తన కూతురితోనే వివాహం చేసుకున్నారనే వార్తలు బాగా వైరల్ అయ్యాయి.

ఎలాన్ మస్క్ ఇటీవళ కవలలకు జన్మనిచ్చారు. ఎలాన్ మస్క్ ఈ వయసులో పిల్లలను కనడమేంటని సోషల్ మీడియాలో అనేక మంది ఆశ్చర్యానికి గురయ్యారు. దీనిపై మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దీనిలో భాగంగానే ఎలాన్ మస్క్ తండ్రి మీడియా ముందుకు వచ్చి మరో షాక్ ఇచ్చారు.

ఎరాల్ మస్క్ మొదటి భార్య మయేతో కొన్నేళ్ల తరువాత విడాకులు తీసుకున్నారు. హైడేను రెండో పెళ్లిచేసుకున్నారు. ఆమెకు అప్పటికే ఇద్దరు పిల్లలున్నారు. వారిలో ఒకరే జానా బెజూడెన్‌హౌట్. ప్రస్తుతం జానాతో ఎరాల్ మస్క్ కలిసి ఉంటున్నారు. 2019లో వారిద్దరికీ ఓ కూతురు కూడా జన్మించింది.

Tags:    

Similar News