Florida Boat Accident: అమెరికాలో పడవ ప్రమాదం.. 39మంది మృతి..
Florida Boat Accident: తాజాగా అమెరికాలో కూడా ఓ ప్రమాదం 39 మంది ప్రాణాలను బలిదీసుకుంది.;
Florida Boat Accident: అంతర్జాతీయ తీరాలలో బోటు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అలాంటి ప్రమాదాల్లో మరణించేవారి సంఖ్య కూడా ఎక్కువే ఉంటుంది. తాజాగా అమెరికాలో కూడా ఓ ప్రమాదం 39 మంది ప్రాణాలను బలిదీసుకుంది. ఈ ఘోర ప్రమాదం వారి కుటుంబాలను విషాదంలో ముంచేసింది.
అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో ఓ పడవ మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 39 మంది గల్లంతయ్యారు. వారి ఆచూకీ కోసం తీరప్రాంత అధికారులు వెతుకులాట ప్రారంభించారు. మానవ స్మగ్లింగ్‌కు ఉపయోగించినట్లు భావిస్తున్న ఈ పడవ కరేబియన్ దేశమైన బహమాస్ నుంచి బయలుదేరినట్టు అధికారులు చెబుతున్నారు.
పోర్టు పియర్స్‌కు తూర్పున 72 కిలోమీటర్ల దూరంలో పడవను పట్టుకొని వేలాడుతున్న వ్యక్తిని గుర్తించిన ఓ సమారిటన్ మంగళవారం కోస్టుగార్డ్‌కు ఫోన్‌కాల్ ద్వారా సమాచారం అందిచాడని సముద్ర భద్రతా ఏజెన్సీ తెలిపింది. మొత్తం 40 మంది ఉన్న పడవలో 39 మంది మరణించారు. ప్లోరిడా సముద్ర తీరం స్మగ్లర్లకు, మానవ అక్రమ రవాణా కేంద్రంగా మారిందని కోస్ట్ గార్డ్ అధికారులు చెప్తు్న్నారు. ఈ పడవ ప్రమాదం ఇదే తరహాకు సంబంధించిందనే అనుమానాలు వ్యక్తం చేశారు.