Ganesh Festival In UAE : అజ్మాన్‌లో ఘనంగా గణేష్ ఉత్సవాలు..
Ganesh Festival In UAE : యూఏఈ అజ్మాన్‌లో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు
Ganesh Festival In UAE : యూఏఈ అజ్మాన్‌లో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. 4 అడుగుల మట్టి విగ్రహాన్ని హైదరాబాద్ నుంచి తీసుకుని వచ్చి యూఏఈలోని మైత్రి ఫార్మ్‌లో ప్రతిష్టాపన చేసి.. పూజలు నిర్వహించారు. అనంతరం నిమజ్జనం చేశారు. ఐదు రోజుల పాటు వేడుకలు నేత్రపర్వంగా సాగాయి. తీన్ మార్ స్టెప్పులు, DJ పాటలతో పిల్లలు, పెద్దలు సందడిగా గడిపారు. సుమారుగా 3 వేల మంది భక్తులు వేడుకల్లో పాల్గొన్నారు. లడ్డు వేలం పాట నిర్వహించారు. మొదటి లడ్డును దుబాయ్‌లో ఉంటున్న రామచంద్రపురానికి చెందిన డేగల నాగేంద్ర, రెండో లడ్డును మార్టేరుకు చెందిన కర్రి లవకుశ రెడ్డి సొంతం చేసుకున్నారు.