UNSC : తొలిసారి రష్యాకు వ్యతిరేకంగా భారత్ ఓటు..
UNSC : ఉక్రెయిన్ అంశంలో రష్యాకు వ్యతిరేకంగా భారత్ తొలిసారి ఓటేసింది;
UNSC : ఉక్రెయిన్ అంశంలో రష్యాకు వ్యతిరేకంగా భారత్ తొలిసారి ఓటేసింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వీడియో టెలీకాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించేందుకు మద్దతు పలికింది. రష్యా గత ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌లో సైనిక చర్య ప్రారంభించింది. ఈ అంశంపై భద్రతా మండలిలో ఇప్పటిదాకా జరిగిన చర్చలు, సమావేశాల్లో భారత్ తటస్థంగా వ్యవహరించింది. కానీ ఈసారి మాత్రం రష్యాను వ్యతిరేకించింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఈ సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొనడాన్ని వ్యతిరేకించిన రష్యా.. ప్రొసీజరల్ ఓటింగ్ కోరింది. ఇందులో భారత్ సహా 13దేశాలు రష్యాకు వ్యతిరేకంగా ఓటేశాయి.