Ukraine Indian Doctor : ఉక్రెయిన్‌లో తెలుగు డాక్టర్.. పులుల కోసం బాంబు షెల్టర్..

Ukraine Indian Doctor : ఉక్రెయిన్ ఇప్పుడు రణరంగంగా మారింది. రష్యా యుద్ధం ప్రారంభించి సుమారు 5 నెలలు పూర్తి కావస్తోంది.

Update: 2022-08-11 10:30 GMT

Ukraine India Doctor : ఉక్రెయిన్ ఇప్పుడు రణరంగంగా మారింది. రష్యా యుద్ధం ప్రారంభించి సుమారు 5 నెలలు పూర్తి కావస్తోంది. అక్కడ ఇప్పుడు బ్రతికి బయటపడటం కూడా పెద్ద చాలెంజ్. అలాంటి పరిస్థితిలో ఉక్రెయన్‌లో పశ్చిమ గోదావరికి చెందిన డాక్టర్. గిరికుమార్ పాటిల్ రెండు పులలను సొంత బిడ్డల్లా సంరక్షించుకుంటున్నారు. జాగ్వార్, బ్లాక్ ఫాంథర్‌ల కోసం తన సంపాదనంతా వెచ్చిస్తున్నాడు.

ఆ రెండు పులుల కోసం ఓ ప్రత్యేక బాంబు షెల్టర్‌ను ఏర్పాటు చేశాడు. వాటి పోషన కోసం అక్కడ ఉన్న తన 5 ఎకరాల ప్లాట్‌ను సైతం అమ్మేశాడు. దాదాపు 80 లక్షలను వాటికోసం ఖర్చుపెట్టాడు. భీకర్ యుద్ధంలో కూడా అవి బతికిబట్టకట్టేలా ఓ బాంబు షెల్టర్‌నూ ఏర్పాటు చేశాడు.  ఇప్పుడు తన రెండు పులులను ఎవ్వరయినా ధనవంతులు పోశించాలను కోరుతున్నాడు. లేదంటే భారత ప్రభుత్వం ఆ రెండు పులులను తనను అక్కడి నుంచి హైదరాబాద్‌కు తీసుకెళ్లి వాటిని జూలో చేర్పించాల్సిందిగా అభ్యర్ధిస్తున్నాడు.

ప్రస్తుతం డాక్టర్ పాటిల్ ఉక్రెయిన్‌లోని సెసిరొడొన్‌టెస్క్‌లో ఉంటున్నారు. 2007 నుంచి ఉక్రెయిన్‌లో డాక్టర్‌గా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా ఆధీనంలో ఉంది కాబట్టి, భారత ప్రభుత్వం తలచుకుంటే తనని తన పులులను సేఫ్‌గా ఇండియాకు తరలించగలరని అంటున్నాడు. 

Full View

Tags:    

Similar News