Manish Dave Ukraine: ఉక్రెయిన్‌లో ఆకలి తీరుస్తోన్న భారతీయ బృందం.. ప్రాణాలకు తెగించి..

Manish Dave Ukraine: గుజరాత్‌కు చెందిన మనీష్ దవే అనే వ్యక్తి చాలాకాలం క్రితం ఉక్రెయిన్‌లోని కీవ్‌లో సెటిల్ అయ్యాడు.;

Update: 2022-03-02 14:56 GMT

Manish Dave Ukraine: ఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతున్న యుద్ధంలో సామాన్య ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోక తప్పట్లేదు. చాలామంది ప్రజలు ఇప్పటికీ తలదాచుకునే ప్రదేశం కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. ఎన్నిసార్లు చర్చలు జరిపినా.. ఉక్రెయిన్‌పై యుద్ధం విషయంలో రష్యా వెనక్కి తగ్గే పరిస్థితే లేదని స్పష్టం చేసింది. అయితే ఇలాంటి కష్ట సమయంలో ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకుపోయిన ఎంతోమంది ఆకలి తీరుస్తు్న్నాడు ఓ భారతీయుడు.

ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను స్వాధీనం చేసుకోవాలన్న ఆలోచనలో రష్యా ఉంది. అందుకే ఆ నగరంపై బాంబు దాడులు చేస్తోంది. అందుకే కీవ్‌లో ఉన్న ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మిగిలినవారు బంకర్లలో తలదాచుకుంటున్నారు. అలాంటి వారికి ఆహారం, నీరు ఏమీ దొరకక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో భారత్‌కు చెందిన ఓ గ్రూప్ వారి ఆకలిని తీరుస్తోంది.

గుజరాత్‌కు చెందిన మనీష్ దవే అనే వ్యక్తి చాలాకాలం క్రితం ఉక్రెయిన్‌లోని కీవ్‌లో సెటిల్ అయ్యాడు. అక్కడే 'సాథియా' అనే పేరుతో రెస్టారెంట్‌ను నడుపుతున్నాడు. అయితే రష్యా, ఉక్రెయిన మధ్య యుద్ధం మొదలవ్వగానే ఎంతోమంది భారతీయ విద్యార్థులతో పాటు ఇతర ప్రజలు కూడా ఈ రెస్టారెంట్‌లో తలదాచుకున్నారు. అప్పటినుండి ఇక్కడ ఉంటున్నవారి ఆకలిని తీర్చే బాధ్యత తీసుకున్నారు మనీష్. ఈయన సేవలను గురించి మనీష్‌పై ప్రత్యేక కథనాలను ప్రచురించింది అంతర్జాతీయ మీడియా.

Tags:    

Similar News