Salman Rushdie : సల్మాన్ రష్దీపై దాడికి వారే కారణం..
Salman Rushdie : ప్రముఖ వివాదాస్పద రచయిత సల్మాన్ రష్దీపై దాడి వెనుక ఇరాన్ ఉందని ఆరోపణలు వచ్చాయి.;
Salman Rushdie : ప్రముఖ వివాదాస్పద రచయిత సల్మాన్ రష్దీపై దాడి వెనుక ఇరాన్ ఉందని ఆరోపణలు వచ్చాయి. దీనికి ఇరాన్ స్పందిస్తూ... ఇరాన్‌కు రష్డీపై చేసిన దాడికి ఎలాంటి సంబంధాలు లేవని ఇరాన్ విదేశాంగశాఖ మంత్రి నాసర్ కనాని ప్రకటించారు. రష్డీపైన జరిగిన దాడికి రష్డీ, ఆయన మద్దతుదారులే కరణమని చెప్పింది. సల్మాన్ రష్దీ తన 'సతానిక్ వర్సస్' పుస్తకం ద్వారా ఓ వర్గం మనోభావాలను ఘోరంగా దెబ్బతీశారని. ఇది వాక్‌స్వాతంత్య్రం అనిపించుకోదని అన్నారు.
భారత సంతతికి చెందిన సల్మాన్ రష్డీ 1988లో 'ద సాతానిక్ వెర్సెస్' అనే నవలను రచించి ప్రచురించారు. అందులో అత్యంత వివాదాస్పదమైన అంశాలను చర్చించారు. అప్పటి ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా రుహొల్లా ఖోమేనీ.. సల్మాన్ రష్డీని చంపేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. భారత్‌లో కూడా సల్మాన్ రష్డీపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది.