Kabul Blast: ఆప్ఘనిస్తాన్ రాజధానిలో భారీ పేలుడు.. 20మందికి పైగా మృతి..
Kabul Blast: ఆప్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో భారీ పేలుడు సంభవించింది.;
Kabul Blast: ఆప్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో భారీ పేలుడు సంభవించింది. కాబూల్ లోని కోటల్ ఈ- ఖైర్‌ఖానా దగ్గరలో ఉన్న ఒక మదరసా లో పేలుడు చోటు చేసుకుంది.ఈ ఘటనలో కనీసం 20 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 మంది వరకు గాయాల పాలయ్యారు. గాయపడ్డవారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. అయితే, ఇప్పటివరకు ఈ బాంబు దాడికి బాధ్యులమని ఏ సంస్థ కూడా ప్రకటించుకోలేదు.