Terrific 22 million Series 236: అనుకోకుండా వచ్చిన అదృష్టం.. ఏకంగా రూ. 44 కోట్లు..
Terrific 22 million Series 236: 22 మిలియన్ దీరామ్స్ అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు 44 కోట్ల 73 లక్షల 52 వేల 598 రూపాయలు.;
Terrific 22 million Series 236: అదృష్టం అనేది ఏ వైపు నుండి ఎలా వస్తుందో ఎవ్వరం చెప్పలేం. ముఖ్యంగా లాటరీ టికెట్ల విషయంలో లక్‌ను ఊహించడం కూడా కష్టమే. కానీ చాలావరకు ఏమీ ఆలోచించకుండా లాటరీ టికెట్‌ను కొనుగోలు చేసినవారికే అదృష్టం తలుపు తడుతుంది. అలాగే అబుదాబిలో పనిచేస్తున్న ఓ కేరళ యువతికి ఈ అదృష్టం దక్కింది. తాను లాటరీ టికెట్‌లో గెలుచుకున్న మొత్తాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
కేరళ త్రిచూర్‌కు చెందిన లీనా జలాల్.. నాలుగేళ్ల క్రితం అబుదాబిలో సెటిల్ అయిపోయింది. ఓ ప్రైవేట్ కంపెనీలో హెచ్‌ఆర్ విభాగంలో పనిచేస్తోంది. అయితే ఫారిన్ దేశాల్లో లాటరీ టికెట్ కల్చర్ ఎక్కువ. పైగా దానిని ఇష్టంగా కొనేవారు కూడా ఎక్కువే. అయితే లీనా కూడా టెర్రిఫిక్ 22 మిలియన్ 236లో ఓ లాటరీ టికెట్‌ను కొనుగోలు చేసింది. అనూహ్యంగా తానే ఆ 22 మిలియన్ల దీరామ్స్‌ను గెలుచుకుంది.
22 మిలియన్ దీరామ్స్ అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు 44 కోట్ల 73 లక్షల 52 వేల 598 రూపాయలు. లీనా ఈ లాటరీ టికెట్‌ను ఒక్కత్తే కొనుగోలు చేయలేదు. తన ఆఫీస్‌లో పనిచేసే మరో తొమ్మిదిమందితో కలిసి కొనుగోలు చేసింది. అలా అయినా కూడా ఒక్కొక్కరికి ఇందులో దాదాపు రూ. 4 కోట్లు దక్కే అవకాశం ఉంది. ఈ లాటరీ టికెట్ తనకు దక్కినందుకు దేవుడికి ధన్యవాదాలు చెప్పుకుంది లీనా.
విశేషం ఏంటంటే.. ఈ లాటరీలో గెలుచుకున్న మరో నలుగురు కూడా భారతీయులే.. లీనా తరువాత లాటరీని గెలుచుకున్న నలుగురు కూడా ఇండియన్సే. వారు మాత్రమే కాకుండా బంగ్లాదేశ్‌కు చెందిన ఓ వ్యక్తికి రేంజ్ రోవర్ ఎవోక్యూ సొంతమయ్యింది. వచ్చే నెల ఈ ప్రైజ్‌లను గెలుచుకున్న వారికి అందజేయనున్నారు.