Britain: బ్రిటన్ ప్రధాని పోటీలో వెనుకంజలో రిషి సునాక్..
Britain: బ్రిటన్ ప్రధాని ఎన్నికల్లో రిషి సునాక్ వెనుకంజలో ఉన్నారు. గెలుపు దిశగా లిజ్ ట్రుస్ దూసుకుపోతున్నారు.;
Britain: బ్రిటన్ ప్రధాని ఎన్నికల్లో రిషి సునాక్ వెనుకంజలో ఉన్నారు. గెలుపు దిశగా లిజ్ ట్రుస్ దూసుకుపోతున్నారు. కన్జర్వేటివ్ పార్టీ వెబ్‌సైట్ నిర్వహించిన సర్వేలో లిజ్ ట్రుస్ ముందంజలో ఉన్నట్లు నివేదిక వచ్చింది. కన్జర్వేటివ్ పార్టీ వెబ్‌సైట్ నిర్వహించిన పోల్‌లో 961 మంది సభ్యులు పాల్గొనగా... లిజ్ ట్రుస్‌కు 60 శాతం మంది మద్దతుగా నిలిచారు. రిషి సునాక్‌కు కేవలం 28 శాతం మంది మాత్రమే మద్దతిచారు. మొత్తానికి లిజ్ ట్రుస్ కంటే 32 పాయింట్లు వెనుకంజలో ఉన్నారు రిషి సునాక్. దాదాపుగా బోరిస్ జాన్సన్ తర్వాత లిజ్ ట్రుస్ ప్రధాని బాధ్యతలు చేపడతారని సర్వేలన్ని చెబుతున్నాయి. అయితే తుది ఫలితాలు మాత్రం వచ్చే నెల 5న వెలువడనున్నాయి.