Volodymyr Zelenskyy: 400 మంది కిరాయి గూండాలతో ఉక్రెయిన్ అధ్యక్షుడి మర్డర్‌కు స్కెచ్..

Volodymyr Zelenskyy: ఇప్పటికే 400 మంది కిరాయి గుండాలు బెలారస్‌ నుంచి ప్రవేశించి, కీవ్‌ వైపు వెళ్లారట.

Update: 2022-03-01 14:58 GMT

Volodymyr Zelenskyy (tv5news.in)

Volodymyr Zelenskyy: రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఏ చర్చలు ఆపలేకపోతున్నాయి. ఇన్నాళ్లు యుద్ధానికి దూరంగా ఉండాలి అనుకున్న ఉక్రెయిన్ కూడా రష్యా చర్యలకు తిరిగి దానిపై గురిపెట్టక తప్పట్లేదు. అందుకే రష్యా, ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం మొదలయ్యింది. అందులో సామాన్య ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీపై హత్యాయత్నం జరగనుంది అనే వార్త అంతటా కలకలం సృష్టిస్తోంది.

ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీను హత్య చేసేందుకు రష్యా 400 మంది కిరాయి గుండాలను రంగంలోకి దింపనుందని అంతర్జాతీయ మీడియాల్లో కథనాలు వినిపిస్తున్నాయి. పైగా వారందరూ ట్రైన్ అయినవాళ్లని కూడా సమాచారం. పైగా వీరంతా రష్యాను చెందినవారు కాదని.. ఆఫ్రికా నుండి ప్రత్యేకంగా వస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. అంతే కాకుండా వీరంతా కలిసి జెలెన్‌స్కీతో పాటు మరో 23 మంది ప్రభుత్వ పెద్దల్ని కూడా చంపేందుకు ప్లాన్ చేశారట.

ఇప్పటికే ఈ 400 మంది గుండాలు ఆఫ్రికా నుండి రష్యాకు వచ్చేశారని సమాచారం. అయితే జనవరిలోనే 2 నుండి 4 వేల మంది కిరాయి గుండాలు ఉక్రెయిన్ చేరుకున్నారని తెలుస్తోంది. అయితే అందులో ప్రత్యేకంగా 400 మంది మాత్రం బెలారస్‌ నుంచి ప్రవేశించి, కీవ్‌ వైపు వెళ్లారట. పుతిన్ చెప్పినట్టు చేస్తే.. ఆ గుండాలకు భారీ మొత్తమే దక్కనుందట. కానీ ఇలాంటి స్కెచ్ కరెక్ట్ కాదన్న వాదన వినిపిస్తోంది.

Tags:    

Similar News