Netherlands: పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు.. ఆ దేశంలో మళ్లీ లాక్‌డౌన్..
Netherlands: కరోనా కొత్త వేరియంట్ ప్రపంచ దేశాలు అన్నింటిని వణికిస్తోంది.;
Netherlands (tv5news.in)
Netherlands: కరోనా కొత్త వేరియంట్ ప్రపంచ దేశాలు అన్నింటిని వణికిస్తోంది. సౌతాఫ్రికాలో పుట్టిన ఈ వేరియంట్ అతి తక్కువ సమయంలోనే ఇండియాలోకి కూడా వచ్చేసింది. అయితే ప్రతీ దేశం ఈ ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తికి బ్రేక్ వేసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. అందులో భాగంగానే ఓ ఫారిన్ దేశం ఏకంగా లాక్‌డౌన్‌నే ప్రకటించింది.
కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో ఇండియా మాత్రమే కాదు.. ప్రపంచం మొత్తం లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. అయితే ఒమిక్రాన్ వ్యాప్తి జరుగుతున్న వేగం చూస్తుంటే మరోసారి లాక్‌డౌన్ తప్పేలా లేదు అనుకుంటున్నారు ప్రజలు. ఇప్పటికే పలు ఫారిన్ దేశాలు కఠినమైన చర్యలను అమలు చేయాలనే ఆలోచనలో ఉన్నాయి. అలా నెదర్లాండ్స్ అయితే ఏకంగా లాక్‌డౌన్‌నే అనౌన్స్ చేసేసింది.
డిసెంబర్ 19 నుండి జనవరి 14 వరకు నెదర్లాండ్స్‌లో లాక్‌డౌన్‌ను ప్రకటించారు ఆ దేశ ప్రధాని మార్క్ రాట్. అత్యవసర సేవలు, నిత్యావసర దుకాణాలు మాత్రమే తెరచి ఉన్నాయి. మిగతావన్నీ మూతబడ్డాయి. పండగలు, ఫంక్షన్లు జరుపుకోవడానికి కూడా ఆంక్షలు విధించారు. న్యూ ఇయర్, క్రిస్మస్ సమయంలో కూడా ఇళ్లల్లో ఒకేచోట ఎక్కువమంది ఉండవచ్చని ప్రకటించారు. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు నెదర్లాండ్స్ ప్రధాని.