New York: ప్రపంచాన్ని వణికిస్తోన్న మంకీపాక్స్.. ఆ దేశంలో ఎమర్జెన్సీ..

New York: మంకీపాక్స్‌ వ్యాప్తి జోరందుకోవడంతో ఆర్థిక రాజధాని న్యూయార్క్‌లో హెల్త్‌ ఎమర్జెన్సీని విధించారు.

Update: 2022-08-01 16:00 GMT

New York: అగ్రరాజ్యం అమెరికాను మంకీపాక్స్ వైరస్ వణికిస్తోంది. మంకీపాక్స్‌ వ్యాప్తి జోరందుకోవడంతో ఆర్థిక రాజధాని న్యూయార్క్‌లో హెల్త్‌ ఎమర్జెన్సీని విధించారు. ప్రస్తుతం న్యూయార్క్‌లో 1,400 మంకీపాక్స్‌ కేసులు నమోదు అయ్యాయి. నగరం వైరస్‌ వ్యాప్తి కేంద్రంగా మారింది. దీంతో కట్టడి చర్యలకు పూనుకున్నారు న్యూయార్ అధికారులు. ప్రజారోగ్యం కోసమే హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించారు.

నగరంలోని లక్షన్నర మంది ప్రజల క్షేమం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మేయర్‌ ఎరిక్‌ ఆడమ్స్‌, హెల్త్‌ అండ్‌ మెంటల్‌ హైజీన్‌ విభాగ కమిషనర్‌ అశ్విన్‌ వాసన్‌ తెలిపారు. అంతేకాకుండా ఈ ఎమర్జెన్సీ తక్షణమే అమలులోకి వస్తుందని మేయర్ ఎరిక్‌ ఆడమ్స్ వెల్లడించారు. మరోవైపు వ్యాక్సిన్‌ పంపిణీని వేగవంతం చేసేందుకు చర్యలు చేపడుతున్నారు అమెరికా అధికారులు.

Tags:    

Similar News