Britain PM: బ్రిటన్ ప్రధాని ఎన్నికలు.. 101 ఓట్లతో రిషి సునాక్ ముందంజ..
Britain PM: బ్రిటన్ ప్రధాని పీఠం రేసులో భారత సంతతికి చెందిన రిషి సునాక్ దూసుకుపోతున్నారు.;
Britain PM: బ్రిటన్ ప్రధాని పీఠం రేసులో భారత సంతతికి చెందిన రిషి సునాక్ దూసుకుపోతున్నారు. ఇప్పటివరకు జరిగిన రెండు రౌండ్లలోనూ రిషి సునాక్ ముందంజలో ఉన్నారు. రిషి సునాక్ మిగతా పోటీదారుల కంటే ఎక్కువగా 101 ఓట్లు సాధించారు. పెన్నీ మోర్డౌంట్ 83 ఓట్లు, లీజ్ ట్రస్ 64 ఓట్లు, కెమి బడెనోష్ 49 ఓట్లు, టామ్ టుగెంధట్ 32 ఓట్లు సాధించారు. తొలిరౌండ్ తర్వాత 11 మంది పోటీలో ఉండగా.. రెండో రౌండ్ ముగిసాక ప్రధాని రేసులో ఐదుగురు మాత్రమే మిగిలారు. అన్ని రౌండ్ల ఓటింగ్ తర్వాత సెప్టెంబరు 5న బ్రిటన్ కొత్త ప్రధాని పేరును ప్రకటిస్తారు.