Russia India Meet : భారత్ రష్యా భేటి.. దానిపైనే కీలక చర్చ..

Russia India Meet : ఉజ్బెకిస్థాన్‌ వేదికగా రేపటి నుంచి రెండురోజులపాటు షాంఘై కో ఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ సదస్సు జరుగనుంది

Update: 2022-09-14 11:23 GMT

Russia India Meet : ఉజ్బెకిస్థాన్‌ వేదికగా రేపటి నుంచి రెండురోజులపాటు షాంఘై కో ఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ సదస్సు జరుగనుంది. ఈ సదస్సులో భారత ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, పాకిస్థాన్‌ ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ వంటి కీలక నేతలు ఒకే వేదికను పంచుకోనున్నారు.

ఈ సందర్భంగా మోడీ.. పుతిన్ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగే అవకాశమున్నట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి.ఇందులో భాగంగా భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ భేటీ కానున్నారు. వ్యూహాత్మక స్థిరత్వం, ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితులు, ఐక్యరాజ్యసమితి, జీ20లో ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం వంటి అంశాలు వీరి అజెండాలో ఉండే అవకాశముంది.

డిసెంబరులో యూఎన్‌వో భద్రతా మండలికి, 2023లో జీ20, SCOకు భారత్‌ అధ్యక్షత వహించనుంది. ఈ నేపథ్యంలో ఈ ద్వైపాక్షిక భేటీకి ప్రాముఖ్యత ఏర్పడింది. గతేడాది డిసెంబర్‌లో పుతిన్‌ భారత్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా తీసుకొన్న నిర్ణయాల అమలుపై కూడా ఈ భేటీలో సమీక్షించనున్నారు. అయితే మోడీ, పుతిన్‌ భేటీపై రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్‌ నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. కానీ భారత విదేశాంగశాఖ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. 

Tags:    

Similar News