Ukraine Russia: 72 గంటల్లో కీవ్ నగరం స్వాధీనం చేసుకుంటాం: రష్యా
Ukraine Russia: రష్యా, ఉక్రేయిన్, యుద్ధం, ఖర్కీవ్‌యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చుతోంది.;
Ukraine Russia: రష్యా, ఉక్రేయిన్, యుద్ధం, ఖర్కీవ్‌యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చుతోంది.. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా రష్యా సైన్యం వేగంగా అడుగులు వేస్తోంది.. అటు రష్యా దాడులను తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి ఉక్రెయిన్ సేనలు.. దీంతో రక్తపాతం జరుగుతోంది.. ఈ యుద్ధంలో సైనికులతోపాటు సామాన్య పౌరులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు.. 400 మంది ఉక్రెయిన్ పౌరులు ఇప్పటి వరకు మృతిచెందినట్లుగా ఆ దేశం ప్రకటించింది.
మరోవైపు రష్యా దాడులను తీవ్రంగా ప్రతిఘటిస్తున్నప్పటికీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కాంప్రమైజ్ దిశగా అడుగులు వేస్తున్నట్లు తాజా సమాచారం.. రష్యా దూకుడును తట్టుకోలేకపోతున్నట్లుగా తెలుస్తోంది.. సహకారం అందిస్తాయనుకున్న నాటో దేశాలు చేతులెత్తేయడంతో చేసేది లేక రాజీ మార్గాలు చూస్తున్నారని తెలుస్తోంది.. అటు రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా జెలెన్‌స్కీ లొంగిపోతే యుద్ధం నిలిపివేస్తామంటూ చెప్తున్నారు.
అటు ఈ యుద్ధంలో రష్యా సైనికులు భారీగా ప్రాణాలు కోల్పోతున్నట్లు ఉక్రెయిన్ చెప్తోంది.. ఇప్పటి వరకు 12వేల మంది రష్యా సైనికులు మృతిచెందినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది.. రష్యాకు చెందిన 1036 సాయుధ వాహనాలు, 303 యుద్ధ ట్యాంకులు, 120 శతఘ్నులు, 80 హెలికాప్టర్లు, 60 ఇంధన ట్యాంకులు, 27 యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ వార్ ఫేర్ సిస్టమ్స్, 48 యుద్ధ విమానాలను ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్ చెప్పింది.