Denmark: డెన్మార్క్ రాజధానిలో కాల్పుల మోత.. ముగ్గురు మృతి..
Denmark: డెన్మార్క్ రాజధాని కొపెన్‌హగన్ తుపాకీ మోతలతో దద్దరిల్లింది. దుండగుడు సాధారణ పౌరులే లక్ష్యంగా కాల్పులు జరిపాడు.;
Denmark: డెన్మార్క్ రాజధాని కొపెన్‌హగన్ తుపాకీ మోతలతో దద్దరిల్లింది. ఓ షాపింగ్‌మాల్‌లో దూరిన దుండగుడు సాధారణ పౌరులే లక్ష్యంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని హాస్పిటల్‌కు తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు.
సంఘటనతో షాపింగ్‌మాల్ దగ్గర భయానక వాతావరణం ఏర్పడింది. కాల్పుల శబ్ధం వినిపించగానే అక్కడి వారిలో కొందరు దుకాణాల్లో దాక్కోగా.. మరికొందరు తొక్కిసలాట మధ్య పరుగులు తీశారు. 22 ఏళ్ల దుండగుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఘటనకు ఉగ్రవాదంతో సంబంధం లేదని కొట్టిపారేయలేమన్నారు. ఈ కేసులో విచారణ జరుపుతున్నామన్నారు.