Minister Damodar Rajanarsimha : 2,322 నర్సింగ్ పోస్టుల భర్తీ : మంత్రి దామోదర రాజనర్సింహ

Update: 2025-09-10 10:11 GMT

నర్సింగ్ కోర్సు పూర్తి చేసిన వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే విషయంలో తమ ప్రభుత్వం నిబద్ధతతో ముం దుకెళ్తుందని, గతేడాది 7 వేల నర్సింగ్ పోస్టు లను భర్తీ చేశామని, ఈ ఏడాది మరో 2,322 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని వైద్యా రోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ విద్యార్థులకు జర్మన్, జపనీస్ భాషలు నేర్పిం చేందుకు ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీతో ఇవాళ ఆరోగ్యశాఖ మంత్రి సమక్షంలో ఒప్పందం చేసుకుంది. ఈ సంద ర్భంగా మంత్రి మాట్లాడుతూ నర్సింగ్ ప్రజల ప్రాణాలు కాపాడే పవిత్రమైన వృత్తి అన్నారు. కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో నర్సుల సేవలు వె లకట్టలేనివన్నారు. నర్సింగ్ కోర్సు పూర్తి చేసిన వారికి రాష్ట్రంలోనే కాకుండా దేశ, విదేశాల్లో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జర్మని, జపాన్ దేశాల్లో నర్సులకు డిమాండ్ ఉందన్నారు. మన వద్ద చదువుకున్న నర్సులకు స్కిల్స్ ఉన్నాయని, కానీ జర్మన్, జపాన్ లాంగ్వేజేస్ రాకపోవడం వల్ల ఆయా దేశాల్లో ఉద్యోగాలు పొందలేకపోతు న్నారన్నారు. అందుకే ఆయా భాషలను వారికి నేర్పించేందుకు ఈఎఫ్ఎల్ యూనివర్సిటీతో ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు. యూనివర్సి టీ స్టూడెంట్స్కు వర్చువల్గా, నేరుగా రెండేళ్ల పాటు విదేశీ భాషల్లో ట్రైనింగ్ ఇచ్చి, సర్టిఫికెట్లు అందజేస్తుందన్నారు. నర్సింగ్ కోర్సుపై విద్యా ర్థుల్లో ఆసక్తి పెరుగుతోందని, అందుకే కొత్తగా 16 ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలను ఏర్పాటు చేశామని, మరో రెండు కాలేజీలు ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు.

Tags:    

Similar News