BEL Recruitment 2021: ఇంజనీరింగ్ అర్హతతో భారత్ ఎలక్ట్రానిక్స్‌లో ఉద్యోగాలు.. జీతం రూ.55,000

BEL Recruitment 2021 : ఎంపికైన అభ్యర్ధులు నాలుగేళ్ల పాటు కాంట్రాక్ట్ విధానంలో పని చేయాల్సి ఉంటుంది.;

Update: 2022-01-03 04:26 GMT

BEL Recruitment 2021: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రాజెక్ట్ ఇంజనీర్ విభాగంలోని మొత్తం 10 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు జనవరి 6ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్ధులు అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు. అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, Pw BD అభ్యర్ధులకు ఫీజులో మినహాయింపు ఉంది. ఎంపికైన అభ్యర్ధులు నాలుగేళ్ల పాటు కాంట్రాక్ట్ విధానంలో పని చేయాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.40 వేల నుంచి రూ.55 వేల వరకు వేతనం చెల్లిస్తారు.

విద్యార్హత..

ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్ చేసిన వారు అప్లై చేసుకునేందుకు అర్హులని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. అభ్యర్థులు 55 శాతం మార్కులు కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, PwBD అభ్యర్తులు పాసై ఉంటే సరిపోతుంది.

ఎలా అప్లై చేసుకోవాలి..

అభ్యర్ధులు మొదటగా https://www.bel-india.in/Default.aspx ఓపెన్ చేయాలి.

అనంతరం Careers విభాగంలో Recruitment Advertisements సెలక్ట్ చేసుకోవాలి.

అనంతరం ఈ లింక్స్ (Link 1 & Link 2) పై క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ ‌ను డౌన్ లోడ్ చేసుకోవాలి.

అనంతరం అప్లికేషన్ ఫామ్‌ను నింపాలి. దీనికి నోటిఫికేషన్లో సూచించిన డాక్యుమెంట్లను జత చేసి పోస్ట్ ద్వారా పంపించాలి.

అప్లికేషన్ ఫామ్‌ను Senior Deputy General Manager (HR) Naval Systems SBU, Bharat Electronics Limited, Jalahalli Post, Bangalore 560013, Karnataka చిరునామాకు జనవరి 6లోగా పంపించాలి.

Tags:    

Similar News