Wipro: కెరీర్ గ్యాప్ మహిళలకు గుడ్న్యూస్ .. విప్రోలో 'బిగిన్ ఎగైన్'
Wipro: ఈ విభాగంలో ఎంపికైన అభ్యర్థులు క్లయింట్ సంబంధిత విధులను నిర్వహించాల్సి ఉంటుంది.;
Wipro Jobs: దేశంలో ప్రముఖ ఐటీ కంపెనీ దిగ్గజం విప్రో కెరీర్ గ్యాప్ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. Account Executive - Banking Financial Services విభాగంలో పోస్టులను భర్తీ చేయనుంది.
ఈ విభాగంలో ఎంపికైన అభ్యర్థులు క్లయింట్ సంబంధిత విధులను నిర్వహించాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలు హైదరాబాద్ లోకేషన్ లో ఉంటాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే దరఖాస్తుకు గడువు ప్రకటించలేదు.
దరఖాస్తు విధానం..
దరఖాస్తు పూర్తిగా ఆన్ లైన్ పద్దతిలో ఉంటుంది.
ముందుగా అధికారిక వెబ్ సైట్ https://careers.wipro.com/opportunities/jobs/2617212?lang=en-us&previousLocale=en-US లింక్ ను ఓపెన్ చేయాలి.
అనంతరం Apply ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
కొత్త వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది.
ఈ మెయిల్ ఐడీ ద్వారా రిజిస్టర్ చేసుకుని తప్పులు లేకుండా అప్లికేషన్ నింపాలి.
ఇన్‌స్ట్రక్షన్‌లు పూర్తిగా చదివి దరఖాస్తు ఫారమ్ నింపాలి.
వివాహం, పిల్లలు, కుటుంబ బాధ్యతల కారణంగా మహిళలు తమ కెరీర్ లో గ్యాప్ తీసుకుంటారు. ఇలాంటి వారి కోసం ప్రముఖ ఐటీ సంస్థ విప్రో బిగిన్ ఎగైన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విప్రో ఇన్ క్లూజన్ అండ్ డైవర్శిటీ ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ కింద కెరీర్ గ్యాప్ ఉన్న మహిళలను నియమించుకోనున్నట్లు ప్రకటించింది.
ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు కెరీర్ విరామం పొందిన మహిళలు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ప్రతిభావంతులైన మహిళలకు కెరీర్ అవకాశాలు మెరుగుపరిచేందుకు వీలు కల్పిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. మహిళలు తిరిగి తమ కెరీర్ ను ప్రారంభించడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం అని పేర్కొంది.