ఐఐటీలో చదువుకోవడమే టెక్నాలజీని మరింత ఎక్కువ మందికి అందించే స్థాయికి తనను చేర్చి ఉంటుందని, ఈ విద్యాసంస్థలో సమయం గడిపే అవకాశం వచ్చినందుకు ఎల్లప్పుడు కృతజ్ఞత తో ఉంటానని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ( Sundar Pichai ) చెప్పారు. సుందర్ పిచాయ్ తో పాటు ఆయన సతీమణి అంజలి కూడా ఐఐటీ ఖరగ్ పూర్ నుంచి పురస్కారాన్ని అందుకున్నారు. భారత్-అమెరికన్ అయిన సుందర్ పిచాయ్ ఐఐటీ ఖరగ్పూర్ నుంచి బీటెక్ పూర్తి చేశారు. తరువాత అమెరికా వెళ్లి స్టాన్ ఫోర్బ్స్ యూనివర్శిటీ నుంచి ఇంజినీరింగ్ అండ్ మెటీరియల్ సైన్స్ లో ఎంఎస్ చదివారు. 2004లో గూగుల్ లో చేరిన ఆయన 2015లో సీఈఓగా నియమిం చబడ్డారు. ఐఐటీలో చదువుతుండగానే ఆయన అంజలిని ప్రేమించి, తరువాత పెళ్లి చేసుకున్నారు.
కెమికల్ ఇంజినీరింగ్ లో ఆమె సాధించిన విజయాలకు విశిష్ట పూర్వ విద్యార్ధి అవార్డును విద్యా సంస్థ ప్రతినిధులు ఆమెకు అందించారు. గూగుల్, ఆల్ఫాబెట్ సంస్థ సీఈఓ సందర్ పిచాయ్ ఐఐటీ ఖరగ్ పూర్ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. శాన్ ఫ్రాన్సిస్కోలో ఇటీవల జరిగిన కార్యక్రమంలో ఐఐటీ డైరెక్టర్ వీకే తివారీ, ఇఇతర ప్రతినిధులు ఆయనకు అనరరీ డాక్టర్ ఆఫ్ సైన్స్ ను అందించారు.
ఈ విషయాన్ని సుందర్ పిచాయ్ సోషల్ మీడియాలో వెల్లడించారు.
"నా పూర్వ విద్యా సంస్థ ఐఐటీ ఖరగ్పూర్ నుంచి గౌరవ డాక్టరేట్ అందు కోవడం చాలా గర్వంగా ఉంది" అని ఆయన తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. తాను డాక్టరేట్ పొందాలని తల్లిదండ్రులు ఎప్పుడూ ఆశపడేవారని తెలిపారు. ఐఐటీ ఖరగ్ పూర్ లో నేర్చుకున్న విద్య, సాంకేతికనే ఈ కార్య క్రమంలో సుందర్ పిచాయ్ తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు.