కిడ్నాప్ గురైన బాలుడిని రక్షించిన హైదరాబాద్ పోలీసులు!
పది రోజులక్రితం ఆబిడ్స్‌లో కిడ్నాప్‌కు గురైన రుద్రమణి అనే బాలుడిని పోలీసులు కనుగొని.. బాలుడిని ఎత్తుకెళ్లిన శామ్ బిలాల్ సోలంకిని అదుపులోకి తీసుకున్నారు.;
హైదరాబాద్‌లో బాలుడి కిడ్నాప్‌ను పోలీసులు చేదించారు. పది రోజులక్రితం ఆబిడ్స్‌లో కిడ్నాప్‌కు గురైన రుద్రమణి అనే బాలుడిని పోలీసులు కనుగొని.. బాలుడిని ఎత్తుకెళ్లిన శామ్ బిలాల్ సోలంకిని అదుపులోకి తీసుకున్నారు. బీదర్‌కు చెందిన శివకుమార్, అంబికా దంపతులు బతుకుదెరువుకోసం నగరానికి వచ్చి నాంపల్లిలో ఉంటున్నారు. తల్లిదండ్రులు లేని సమయంలో ఇంటిముందు ఆడుకుంటున్న బాలుడికి చాక్లెట్ ఆశ చూపించి.. కిడ్నాప్ చేశాడు. అనంతరం షామ్ బిలాల్ బాలుడిని మహారాష్ట్ర తీసుకెళ్లాడు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు .. సీసీకెమెరాలను పరిశీలించి నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు.