India Post Office Recruitment 2022: 10వ తరగతి అర్హతతో ఇండియా పోస్ట్‌ ఆఫీస్‌లో కార్ డ్రైవర్ ఉద్యోగాలు.. జీతం రూ. 63,200

India Post Office Recruitment 2022: ఇండియా పోస్ట్ ఆఫీస్ (పోస్టల్ సర్కిల్) ఇండియా పోస్ట్ ఆఫీస్ (పోస్టల్ సర్కిల్) అధికారిక నోటిఫికేషన్ ఆగస్ట్ 2022 ద్వారా స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతోంది.;

Update: 2022-09-05 06:35 GMT

India Post Office Recruitment 2022: 10వ తరగతి అర్హతతో ఇండియా పోస్ట్‌ ఆఫీస్‌లో కార్ డ్రైవర్ ఉద్యోగాలు.. జీతం రూ. 63,200

ఇండియా పోస్ట్ ఆఫీస్ (పోస్టల్ సర్కిల్) ఇండియా పోస్ట్ ఆఫీస్ (పోస్టల్ సర్కిల్) అధికారిక నోటిఫికేషన్ ఆగస్ట్ 2022 ద్వారా స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతోంది. అధికారిక వెబ్‌సైట్ www.indiapost.gov.inలో కార్ డ్రైవర్ ఉద్యోగాల కోసం 26 సెప్టెంబర్ 2022 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్య వివరాలు..

పోస్ట్ పేరు: స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్ట్

మొత్తం ఖాళీలు: 20

జీతం : నెలకు రూ.19900 నుండి 63,200

స్థానం: బెంగళూరు, కర్ణాటక, భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో

అర్హత: 10వ తరగతి ఉత్తీర్ణత

వయోపరిమితి: 18 సంవత్సరాల నుండి 56 సంవత్సరాలు..

SC, ST అభ్యర్థులకు 5 సంవత్సరాల సడలింపు ఉంటుంది.

2A, 2B, 3A,3B అభ్యర్ధులకు 3 సంవత్సరాల సడలింపు ఉంటుంది.

దరఖాస్తు రుసుము.. లేదు

నోటిఫికేషన్ ప్రకారం.. SSLC (10వ తరగతి, 12వ తరగతి సర్టిఫికెట్, డిగ్రి సర్టిఫికెట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్, పుట్టిన తేదీ రుజువు, కంప్యూటర్ సర్టిఫికెట్, కులం మరియు ఆదాయ సర్టిఫికెట్,

ఫోటో, సంతకం మరియు వైకల్యం ఏదైనా ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికెట్.

ఎంపిక విధానం..

డ్రైవింగ్ పరీక్ష

వ్రాత పరీక్ష

డాక్యుమెంట్ వెరిఫికేషన్/ఇంటర్వ్యూ

ఎలా దరఖాస్తు చేయాలి..

దరఖాస్తుకు అవసరమైన అన్ని పత్రాలను జత చేసి స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టులకు.. వినాయక్ మిశ్రీ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ (అడ్మిన్) డిపార్ట్‌మెంట్ హెడ్-న్యూఢిల్లీ

స్టాఫ్ కార్ డ్రైవర్ (Gr-C) పోస్టులకు మేనేజర్, మెయిల్ మోటార్ సర్వీస్, బెంగళూరు 560001, కర్ణాటక అడ్రస్‌కు పంపాలి. 

Tags:    

Similar News