Indian Navy Sailor Recruitment 2022: టెన్త్, ఇంటర్ అర్హతతో నేవీలో సెయిలర్ పోస్టుల భర్తీ.. జీతం రూ. 21,700 - 69,100

Indian Navy Sailor Recruitment 2022: ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ మార్చి 29, 2022న ప్రారంభమై ఏప్రిల్ 5, 2022న ముగుస్తుంది.

Update: 2022-03-24 05:45 GMT

Indian Navy Recruitment 2022: ఇండియన్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ఆధ్వర్యంలోని ఇండియన్ నేవీ సెయిలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఆర్టిఫైసర్ అప్రెంటీస్ (AA), సీనియర్ సెకండరీ రిక్రూట్‌ల కోసం 2500 సెయిలర్‌లను రిక్రూట్ చేయడానికి అర్హులైన, ఆసక్తిగల అవివాహిత పురుష అభ్యర్ధుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ మార్చి 29, 2022న ప్రారంభమై ఏప్రిల్ 5, 2022న ముగుస్తుంది.

ముఖ్య సమాచారం. .

పోస్ట్ పేరు: ఇండియన్ నేవీలో ఆర్టిఫైసర్ అప్రెంటిస్ (AA), సీనియర్ సెకండరీ రిక్రూట్‌ల కోసం సెయిలర్లు

అర్హత: మ్యాథ్స్, ఫిజిక్స్ లో కనీసం 60% మార్కులతో 12/10+2 పరీక్ష ఉత్తీర్ణత లేదా తత్సమానం.

కనీసం ఒక సబ్జెక్టు - కెమిస్ట్రీ/బయాలజీ/కంప్యూటర్ సైన్స్ ఉండాలి.

జీతం: రూ. 21,700 నుండి రూ. 69,100

ఇండియన్ నేవీ యూనిట్లలో అనుభవం ఉన్న లేదా ఫ్రెషర్స్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు

అప్లికేషన్ ప్రారంభ తేదీ మార్చి 29, 2022 అప్లికేషన్ ముగింపు తేదీ ఏప్రిల్ 5, 2022

వయస్సు

అభ్యర్థులు 17 నుంచి 22 మధ్య ఉండాలి. రిజర్వ్ చేయబడిన కేటగిరీలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ.215. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఫీజు లేదు.

ఎంపిక

వ్రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా జరుగుతుంది.

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా అధికారిక ఇండియన్ నేవీ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. ఏప్రిల్ 5, 2022లోపు తమ దరఖాస్తులను సమర్పించాలి.

Tags:    

Similar News