Integral Coach Factory recruitment 2021: టెన్త్, ఇంటర్ అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు.. పరీక్ష లేకుండానే భర్తీ..

Integral Coach Factory recruitment 2021: ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నైలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

Update: 2021-10-19 03:30 GMT

Integral Coach Factory recruitment 2021: ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నైలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 782 అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు గడువు అక్టోబర్ 26. అభ్యర్ధులు గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి పది, పన్నెండు తరగతులు చదివి ఉండాలి. మరిన్ని వివరాలకు వెబ్‌సైట్ http://pb.icf.gov.in/act/ను సందర్శించాలి.

ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఇండియాలోని తొలి ఉత్పత్తి యూనిట్లలో ఒకటి. ఇది అక్టోబర్ 2, 1955 న ప్రారంభించబడింది. ఈ సంస్థలో 4000 కంటే ఎక్కువ కోచ్‌లను ఉత్పత్తి చేయడానికి 9500 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు.

అర్హతలు..

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు కనీసం 50% మార్కులతో ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10 లేదా 12 ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత ట్రేడ్‌లో IIT డిగ్రీ తప్పనిసరి. అభ్యర్ధి వయసు అక్టోబర్ 26, 2021 నాటికి 15 సంవత్సరాల నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. OBC అభ్యర్ధులకు గరిష్ట వయోపరిమితి సడలింపు 3 సంవత్సరాలు అయితే SC , ST అభ్యర్ధులకు 5 సంవత్సరాల సడలింపు ఉంటుంది.

ఎంపిక మెరిట్ ఆధారంగా ఉంటుంది. అభ్యర్ధి అకడమిక్ అర్హతల ద్వారా షార్ట్ లిస్ట్ చేస్తారు.

దరఖాస్తు విధానం..

ఆన్‌లైన్ ద్వారా చేయాలి.

వెబ్‌సైట్ http://pb.icf.gov.in/act/ను సందర్శించాలి.

నోటిఫికేషన్ పూర్తిగా చదవాలి.

తరువాత how to apply అనే అప్షన్‌లోకి వెళ్లి అప్లికేషన్ విధానం చదవాలి. అనంతరం అప్లై చేయాలి.

దరఖాస్తుకు సంబంధించిన పత్రాలు అందుబాటులో ఉంచుకోవాలి. పరీక్ష ఫీజు రూ.100 చెల్లించాలి.

దరఖాస్తు చేసుకున్న తరువాత అప్లికేషన్ ఫాంను ఫ్రింటవుట్ తీసుకోవాలి. 

Tags:    

Similar News